breaking news
Maa Inti Bangaram Movie
-
సమంత రాజ్.. నో హనీమూన్, నో రిలాక్స్
హీరోయిన్ సమంత.. నాలుగు రోజుల క్రితం మరో పెళ్లి చేసుకుంది. 'ద ఫ్యామిలీ మ్యాన్' దర్శకుడు రాజ్ నిడిమోరుతో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. సాధారణంగా వివాహం తర్వాత సెలబ్రిటీలు చాలామంది హనీమూన్ ప్లాన్ చేస్తుంటారు. కానీ సామ్ మాత్రం పనిలో పడిపోయింది. అందుకు సంబంధించిన ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.చివరగా విజయ్ దేవరకొండతో 'ఖుషి' సినిమాలో సమంత కనిపించింది. తర్వాత తానే నిర్మాతగా మారి 'శుభం' అనే మూవీ తీసింది. ఈ ఏడాది మే నెలలో చిత్రం రిలీజై ఓకే ఓకే అనిపించుకుంది. తానే నిర్మాత, హీరోయిన్గా సమంత.. 'మా ఇంటి బంగారం' అనే చిత్రం చేస్తోంది. గత నెలలోనే షూటింగ్ మొదలుపెట్టారు. ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేశారు.(ఇదీ చదవండి: సమంతకి కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చిన రాజ్?)మధ్యలో సమంత పెళ్లి వల్ల కాస్త గ్యాప్ ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు చిత్రీకరణ మొదలైంది. ఈ విషయాన్ని సమంత బయటపెట్టింది. సెట్స్‌లో దర్శకురాలు నందినీ రెడ్డితో ఉన్న ఫొటోని ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. అలా పెళ్లయిన నాలుగు రోజులకే హనీమూన్ లాంటివి ప్లాన్ చేసుకోకుండా పనిలో పడిపోయిందనమాట.'మా ఇంటి బంగారం' సినిమా విషయానికొస్తే.. లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీ అని తెలుస్తోంది. చాన్నాళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటికీ.. కొన్నాళ్ల ముందే నందినీ రెడ్డి దర్శకత్వంలో మొదలైంది. ఈ సినిమాని సమంత నిర్మిస్తున్నప్పటికీ.. రాజ్ కూడా భాగస్వామిగా ఉన్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: బోల్డ్ వెబ్ సిరీస్.. ఫైనల్ సీజన్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
సమంత 'బంగారం'లో కాంతార విలన్
కొన్నిరోజుల క్రితం థియేటర్లలోకి వచ్చిన 'కాంతార 1'.. ఇప్పటికీ థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఈ శుక్రవారం ఓటీటీలోకి కూడా రానుంది. అయితే ఈ మూవీలో విలన్‌గా చేసిన గుల్షన్ దేవయ్య తన నటనతో బాగానే ఆకట్టుకున్నాడు. గతంలో హిందీలో పలు చిత్రాలు, వెబ్ సిరీసులు చేసిన ఇతడు.. ఇప్పుడు తెలుగులో నటించేందుకు రెడీ అయిపోయాడు.(ఇదీ చదవండి: 'సలార్' కాటేరమ్మ ఫైట్‌లో నేనే చేయాలి.. కానీ: టాలీవుడ్ హీరో)మయాసైటిస్ కారణంగా చాన్నాళ్లుగా యాక్టింగ్ పక్కనబెట్టేసిన సమంత.. ఈ ఏడాది నిర్మాతగా 'శుభం' అనే మూవీని రిలీజ్ చేసింది. ఇప్పుడు తనే నిర్మాత కమ్ హీరోయిన్గా 'మా ఇంటి బంగారం' అనే చిత్రంలో నటిస్తోంది. దసరాకు పూజతో లాంఛనంగా మొదలైన ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కూడా ఇప్పుడు షురా అయిపోయింది. ఆ విషయాన్ని వెల్లడిస్తూ ఇన్ స్టాలో పోస్ట్ కూడా పెట్టారు.నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సమంత.. గృహిణిగా ఉంటూనే గన్ పట్టి యాక్షన్ కూడా చేయబోతుంది. ఇదే మూవీలో 'కాంతార 1' ఫేమ్ గుల్షన్ దేవయ్య కూడా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని ఇతడే స్వయంగా బయటపెట్టాడు. సమంత పోస్ట్‌ని తన ఇన్ స్టా స్టోరీలో రీ పోస్ట్ చేసిన ఇతడు.. 'నేను కూడా ఇందులో ఉన్నాను' అని చెప్పుకొచ్చాడు. ఇదే ఇతడికి తెలుగులో మొదటి సినిమా. మరి సమంత పక్కన నటిస్తాడా లేదంటే విలన్‌గా చేయబోతున్నాడా అనేది చూడాలి?(ఇదీ చదవండి: కొందరు నటులు అసలు సెట్‌కే రారు.. 'ఓజీ' విలన్ కామెంట్స్)


