హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'మా ఇంటి బంగారం'. 'ఓ బేబీ' తర్వాత సామ్‌తో దర్శకురాలు నందిని రెడ్డి చేస్తున్న రెండో మూవీ ఇది. సమంత స్థాపించిన ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై భర్త రాజ్ నిడిమోరుతో కలిసి నిర్మిస్తోంది. శుక్రవారం (జనవరి 9న) మా ఇంటి బంగారం టీజర్ రిలీజ్ చేశారు.
టీజర్ రిలీజ్
'ఎట్లాగో ఇక్కడివరకు వచ్చినాం కదా.. ఉండిపోదాం...' అన్న సామ్ డైలాగ్‌తో వీడియో మొదలవుతుంది. అత్తగారిల్లిది.. ఇంకోసారి ఆలోచించుకో అంటే 'అందరూ ఎంతో మంచోల్లలాగా ఉండారు. నాకు చూస్తాంటే ఎప్పటినుంచో తెలిసినట్లుంది. నువ్వు చూస్తా ఉండు, వారం రోజుల్లో ఫుల్లుగా కలిసిపోతాం..' అని సామ్ అత్తారింట్లో అందరితో బాగుండేందుకు ప్రయత్నిస్తుంది.
అటు క్లాస్, ఇటు మాస్
చీర కట్టు, బొట్టుతో సింపుల్‌గా అమాయకంగా కనిపిస్తూనే.. యాక్షన్ సీన్స్ అదరగొట్టేసింది. ముఖ్యంగా బస్‌లో, ఏకంగా అత్తగారింట్లో సమంత ఫైట్ సీన్స్ చేసినట్లు చూపించారు. టీజర్ అయితే అదిరిపోయింది. సామ్ అటు క్లాస్, ఇటు మాస్ లుక్‌లో కనిపించేసరికి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మా ఇంటి బంగారం సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రానికి రాజ్ నిడిమోరు, వసంత్ మారిగంటి కథ అందించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.


