లిరిక్ రైటర్ చంద్రబోస్ ఇంట్లో విషాదం | Lyric Writer Chandrabose Brother Passed Away Due To Heart Stroke | Sakshi
Sakshi News home page

Chandrabose: ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఇంట విషాదం

May 3 2026 7:31 PM | Updated on May 3 2026 8:08 PM

Lyric Writer Chandrabose Brother Passed Away

తెలుగులో చాన్నాళ్ల నుంచి గీత రచయితగా గుర్తింపు తెచ్చుకుని.. 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నాటు నాటు పాటకు ఏకంగా ఆస్కార్ అవార్డ్ అందుకున్న చంద్రబోస్ ఇంట విషాదం నెలకొంది. ఈయన సోదరుడు రాజేంద్ర గుండెపోటుతో చనిపోయారు. దీంతో ఈయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

(ఇదీ చదవండి: రజనీ సినిమాలో చిరంజీవి భార్య.. భర్తని తలుచుకుని ఎమోషనల్)

రాజేంద్ర.. వ్యాపారం కోసం బెంగళూరు నుంచి అన్నమయ్య జిల్లా కలికిరి నగరానికి వచ్చారు. తన స్నేహితుడు శ్రీనివాసరెడ్డి ఇంట్లో శనివారం రాత్రి బసచేశారు. ఆదివారం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రాథమిక వైద్యం చేసుకున్న తర్వాత కలికిరి క్రాస్ రోడ్‌లో ఓ హోటల్‌లో టిఫిన్ చేశారు. తర్వాత వెంటనే అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేశారు.

(ఇదీ చదవండి: సమంత 'బంగారం'.. ఇలా అయిందేంటి?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement