సినిమా సెలబ్రిటీల ప్రేమ అనేది చాలా సాధారణమైన విషయం. ప్రేమలో పడటం, డేటింగ్ చేయడం లాంటివి వింటూనే ఉంటాం. హీరోయిన్ తమన్నా కూడా నటుడు విజయ్ వర్మతో గతంలో డేటింగ్ చేసింది. మరి ఏమైందో ఏమో వీళ్లిద్దరూ విడిపోయారు. అలాంటిది తాజాగా తమన్నా చేసిన కామెంట్స్.. మళ్లీ ఈమె ప్రేమలో పడిందా అనే సందేహాలు రేకెత్తిస్తున్నాయి.
(ఇదీ చదవండి: సమంత 'బంగారం'.. ఇలా అయిందేంటి?)
'ప్రేమ అనేది ఓ లావాదేవి కాదు. మనం ఎదుటి వ్యక్తికి ప్రేమ ఇస్తున్నప్పుడు తిరిగి దాన్ని ఆశించడం కరెక్ట్ కాదు. జీవితంలో ఎన్ని సార్లయినా ప్రేమలో పడే అవకాశముంది. అది కేవలం ఒక్కరితే పరిమితం కావాల్సిన అవసరం లేదు. ఒక్కసారి డిసైడ్ అయితే ఎన్నిసార్లయినా ప్రేమ పుడుతుంది. బంధాలు మనల్ని బంధించేవిగా ఉండకూడదు. మన ఎదుగుదలకు తోడ్పడేలా ఉండాలి' అని తమన్నా చెప్పడం ఆసక్తికరంగా అనిపించింది.
'లస్ట్ స్టోరీస్ 2' షూటింగ్ టైంలో తమన్నా, విజయ్ వర్మ డేటింగ్ చేసినట్లు రూమర్స్ వచ్చాయి. అందుకు తగ్గట్లే బయట చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. కానీ వీళ్లిద్దరూ విడిపోయారు. తమన్నా ఇలా డౌట్ వచ్చే కామెంట్స్ చేస్తుండగా.. విజయ్ వర్మ కూడా మరో అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. రీసెంట్‌గానే ఒకటి రెండు ఫొటోలు వైరల్ అయ్యాయి.
(ఇదీ చదవండి: మహేశ్ 'వారణాసి'కి నీటి కష్టాలు!)


