-
తమన్నాతో డేటింగ్.. అప్పుడే మొదలైందన్న బాయ్‌ఫ్రెండ్!
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది జైలర్ మూవీలో స్పెషల్ సాంగ్‌తో కుర్రాళ్లను ఓ ఊపు ఊపేసింది. అంతే కాకుండా లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్‌తో అలరించింది. అయితే ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న భామ.. అరణ్మణై- 4 అనే తమిళ చిత్రంతో పాటు స్ట్రీ-2 అనే మూవీలో నటిస్తోంది. ఇదిలా ఉండగా గతేడాది తమన్నా తన బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మను అభిమానులకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు వీరిద్దరు పెళ్లి గురించి ఎక్కడా ప్రస్తావించడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన విజయ్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తమన్నాతో డేటింగ్ ఎప్పుడు ప్రారంభించారనే విషయంపై క్లారిటీ ఇచ్చారు. విజయ్ వర్మ మాట్లాడుతూ..' తమన్నా, నేను డేటింగ్ ప్రారంభించింది లస్ట్ స్టోరీస్-2 షూటింగ్లో కాదు. ఆ సమయంలో ర్యాప్ పార్టీ జరగాల్సింది. కానీ కుదరలేదు. మేమే నలుగురం కలిసి పార్టీ చేసుకోవాలనుకున్నాం. ఆ రోజే తమన్నాకు అసలు విషయం చెప్పాను. నేను మీతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నట్లు ఆమెతో చెప్పా. ఆ తర్వాత మేం కలవడానికి దాదాపు 20 నుంచి 25 రోజులు పట్టిందని చెప్పుకొచ్చాడు. అయితే వీరిద్దరు జంటగా నటించిన లస్ట్ స్టోరీస్-2 చిత్రంలో కెమిస్ట్రీకి అభిమానులు సైతం ఫిదా అయ్యారు. దీంతో ఆ మూవీ సమయంలోనే డేటింగ్ ప్రారంభించారని ఫ్యాన్స్ భావించారు. కానీ తాజాగా ఈ విషయంపై విజయ్ వర్మ క్లారిటీ ఇచ్చారు. కాగా.. కొన్ని రోజుల క్రితమే విజయ్ వర్మ, తమన్నా భాటియా జంటగా ఓ పార్టీకి వెళ్తూ కనిపించారు. కాగా.. కొత్త ఏడాదిలో విజయ్ వర్మ మర్డర్ ముబారక్ సినిమాతో అలరించాడు. గతేడాది జానే జాన్, దాహాద్, లస్ట్ స్టోరీస్-2 చిత్రాలతో మెప్పించారు. ప్రస్తుతం ఉల్ జలూల్ ఇష్క్‌లో విజయ్ వర్మ కథానాయకుడిగా కనిపించనున్నారు. వీరిద్దరు డేటింగ్ గురించి తెలిసినప్పటీ నుంచి పెళ్లి గురించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని తెగ ఆరా తీస్తున్నారు. ఈ ఏడాదిలోనైనా వివాహాబంధంలోకి అడుగుపెడతారో లేదో వేచి చూడాల్సిందే. కాగా.. ఇటీవలే పెళ్లి కూతురులా తయారైన ఫొటోలను తన కాస్ట్యూమ్ డిజైనర్ ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు. అవి కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. చాలా అందంగా ఉన్నారు, పెళ్లి కూతురులా ఉన్నారు అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మరి కొందరైతే అంతా బాగానే ఉంది గానీ పెళ్లెప్పుడో? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. -
తమన్నా.. పెళ్లి ఎప్పుడు?
-
తమన్నా..పెళ్లెప్పుడో?
తమిళసినిమా: అందం తిన్నానండీ అందుకే ఇట్టా ఉన్నానండీ.. అంటూ నటి తమన్నా ఓ చిత్రంలో ఐటమ్ సాంగ్‌కు ఆడిపాడిన విషయం తెలిసిందే. ఆ పాటకు తగ్గట్టుగానే 36 ఆరేళ్ల వయస్సు మీద పడినా తరగని అందాలతో యువత గుండెల్ని కొల్లగొడుతున్న నటి తమన్నా. ఇటీవల జైలర్ చిత్రంలో నువ్వు కా వాలయ్యా అంటూ ఆడి దుమ్మురేపిన ఈ మిల్కీబ్యూటీకి ప్రస్తుతం అవకాశాలు తగ్గినా క్రేజ్ మాత్రం అలాగే మెయిన్టైన్ చేస్తోంది. ప్రస్తుతానికి అరణ్మణై 4 చిత్రం మాత్రమే తమిళంలో ఈమె చేతిలో ఉంది. అయితే హిందీలో అవకాశాలు వరిస్తున్నాయట. ఇకపోతే బాలీవుడ్ నటుడు, నిర్మాత విజయ్‌వర్మ ప్రేమలో మునిగి తేలుతున్న తమన్నా ఆయనతో డేటింగ్లో ఉన్నారు. అయితే పెళ్లి ఊసు మాత్రం ఎత్తడం లేదు. కాగా తాజాగా పెళ్లి కూతురులా తయారైన ఫొటోలను ఆయన కాస్ట్యూమ్ డిజైనర్ ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. చాలా అందంగా ఉన్నారు, పెళ్లి కూతురులా ఉన్నారు అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మరి కొందరైతే అంతా బాగానే ఉంది గానీ పెళ్లెప్పుడో? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. -
డైరెక్ట్‌గా ఓటీటీకి మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రస్తుతం ఆడియన్స్ ఓటీటీకి బాగా అడిక్ట్ అయిపోయారు. అలాంటి వారికోసమే వరుసపెట్టి సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేస్తున్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్, జానర్లతో ఓటీటీ ప్రియులను అలరిస్తున్నాయి. తాజాగా మరో సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పంకజ్ త్రిపాఠి, సారా అలీ ఖాన్, కరిష్మా కపూర్, విజయ్ వర్మ, సంజయ్ కపూర్, టిస్కా చోప్రా, డింపుల్ కపాడియా లాంటి భారీ తారాగణంతో రూపొందించిన మర్డర్ మిస్టరీ మూవీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న మర్డర్ ముబారక్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి హోమి అడజానియా దర్శకత్వం వహించారు. ప్రముఖ బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో నటించడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ చూస్తే సస్పెన్స్ థ్రిల్లర్‌గానే తెరెకెక్కించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని సెలబ్రిటీలు, పెద్దపెద్ద వ్యాపారవేత్తలకు మాత్రమే అనుమతి ఉన్న రాయల్ ఢిల్లీ క్లబ్లో జరిగిన ఓ మర్డర్ ఆధారంగా కథను రూపొదించారు. ఈ మిస్టరీ థ్రిల్లర్ డైరెక్ట్‌గా మార్చి 15వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. కాగా.. సారా అలీ ఖాన్ నటించిన మరో మూవీ 'ఏ వతన్ మేరే వతన్' కూడా నేరుగా ఓటీటీలోకి వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్చి 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. -
పేరు మార్చుకోవడంపై తమన్నా కామెంట్స్.. కారణం అదేనంటూ!
మిల్కీ బ్యూటీ తమన్నా రచ్చ లేపుతోంది. వయసు పెరుగుతున్నా సరే గ్లామర్ మెంటైన్ చేయడంలో వారెవ్వా అనిపిస్తోంది. నటిగా కెరీర్ ప్రారంభించి దాదాపు 20 ఏళ్లు పూర్తి కావొస్తుంది. అయితేనేం ఇప్పటికీ సినిమాలు-సిరీసులు లాంటవి చేస్తూ ఎంటర్టైన్ చేస్తోంది. సరే ఇదంతా పక్కనబెడితే తమన్నా పేరు ఇది కాదని, మార్చుకుందని మీలో ఎంతమందికి తెలుసు? ఇప్పుడు ఆ విషయమై తాజాగా ఓ ఇంటర్వ్యూలో సీక్రెట్ బయటపెట్టింది. తమన్నా అంటే 'కోరిక' అని అర్థమట. 8-9 ఏళ్ల వయసున్నప్పుడే నటి కావాలని ఈ ముద్దుగుమ్మ ఫిక్సయిందట. అప్పుడు అనుకోవడం ఏమో గానీ టీనేజ్‌లోకి వచ్చేసరికి మోడలింగ్‌లో అడుగుపెట్టింది. 2005లో ఒకేసారి తెలుగు, హిందీ సినిమాలతో హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత తమిళ, కన్నడలోనూ నటించింది. అయితే తమన్నా.. తెలుగులోనే కొన్నేళ్ల పాటు వరస చిత్రాలు చేసి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. (ఇదీ చదవండి: డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఆ యాక్షన్ సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) సినిమాల్లో ఎంట్రీ ఇద్దామని తమన్నా అనుకున్నప్పుడు.. ఒకాయన ఈమెని కలిసి పేరులో మార్పు చేసుకోమని చెప్పాడు. ఇంగ్లీష్‌లో అదనంగా a,h జోడీంచమని సలహా ఇచ్చాడు. అలానే నా పేరు Tamannaah అయిందని ఈ బ్యూటీ చెప్పింది. ఈ పేరు మార్పు అనేది తనలో ఓ పాజిటివ్ ఫీలింగ్ తీసుకొచ్చిందని, కెరీర్ పరంగానూ కలిసొచ్చిందని తమన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇకపోతే తమన్నా.. నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తోంది. గత రెండేళ్ల నుంచి వీళ్లిద్దరూ జంటగా చాలాసార్లు కనిపించారు. పెళ్లి గురించి సరిగా క్లారిటీ ఇవ్వడం లేదు గానీ ఈ ఏడాది తమన్నా-విజయ్ ఒక్కటైపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. (ఇదీ చదవండి: రెండో పెళ్లి.. కళ్యాణ మండపంలోనే ఏడ్చేసిన నటి)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్‌స్టాప్‌గా...
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement