నాని సినిమాలో బాలీవుడ్ స్టార్ | bollywood Star vijay varma in Nani MCA | Sakshi
Sakshi News home page

నాని సినిమాలో బాలీవుడ్ స్టార్

Jun 28 2017 4:05 PM | Updated on Sep 5 2017 2:42 PM

నాని సినిమాలో బాలీవుడ్ స్టార్

నాని సినిమాలో బాలీవుడ్ స్టార్

ప్రస్తుతం నిన్ను కోరి సినిమా రిలీజ్ కోసం రెడీ అవుతున్న యంగ్ హీరో నాని, తన నెక్ట్స్ సినిమాను కూడా

ప్రస్తుతం నిన్ను కోరి సినిమా రిలీజ్ కోసం రెడీ అవుతున్న యంగ్ హీరో నాని, తన నెక్ట్స్ సినిమాను కూడా పట్టాలెక్కించేశాడు. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాలో నాని సరసన సాయి పల్లవి హీరోయిన్ నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఓ బాలీవుడ్ నటుడు కీలక పాత్రలో కనిపించనున్నాడు.

ఇటీవల ఘనవిజయం సాధించిన పింక్ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న యువ నటుడు విజయ్ వర్మ, నాని ఎంసీఏలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. తన ఫ్రెండ్ ద్వారా దర్శకుడు వేణు శ్రీరామ్ పరిచయమయ్యాడని, ఆయన చెప్పిన కథ నచ్చటంతో తెలుగు సినిమాకు అంగీకరించానని తెలిపాడు. అంతేకాదు ఈ సినిమాలో తెలుగు డైలాగ్ లు ఆయనే స్వయంగా చెప్పుకుంటున్నాడట. అయితే తన పాత్ర ఏంటి అన్న విషయం మాత్రం విజయ్ వర్మ వెల్లడించలేదు.

Advertisement
 
Advertisement
Advertisement