తమన్నాతో బ్రేకప్.. విజయ్ వర్మ ఏమన్నారంటే..
Mar 29 2025 12:51 PM | Updated on Mar 29 2025 1:27 PM
తమన్నా(Tamannaah Bhatia), విజయ్ వర్మల మధ్య బ్రేకప్ అంటూ గత కొంతకాలంగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా గతంలో ప్రకటించారు. కానీ ఇప్పుడు పెళ్లి విషయంలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి బ్రేకప్ చెప్పుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో విజయ్ వర్మ (Vijay Varma) తన రిలేషన్‌షిప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక సంబంధంలో కోపం, బాధ, సంతోషం, చిరాకు వంటి భావోద్వేగాలన్నీ అనుభవించాలని, వాటిని స్వీకరించడం ద్వారానే ఆ బంధాన్ని సంతోషమయం చేసుకోవచ్చని అన్నారు. "రిలేషన్‌షిప్‌ను ఐస్‌క్రీమ్ లాగా ఆస్వాదించాలి. అప్పుడే నీవు సంతోషంగా ఉంటావు" అని విజయ్ పేర్కొన్నారు.
మరోవైపు, తమన్నా కూడా ప్రేమపై కీలక వ్యాఖ్యలు చేశారు. "ప్రేమను వ్యాపార లావాదేవీలా చూడటం ప్రారంభించినప్పుడే సమస్యలు మొదలవుతాయి. రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు కంటే ఒంటరిగా ఉన్నప్పుడే నేను ఎక్కువ సంతోషంగా ఉన్నాను" అని ఆమె అన్నారు. జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించారు. ఈ ఇద్దరి వ్యాఖ్యలను బట్టి చూస్తే, వీరు విడిపోయారనే వార్తలు నిజమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
2023లో విడుదలైన ‘లస్ట్ స్టోరీస్ 2’ వెబ్ సిరీస్‌లో తమన్నా, విజయ్ వర్మ కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరు ప్రేమలో పడ్డారు. ఈ విషయాన్ని తమన్నా పలు ఇంటర్వ్యూలలో పంచుకున్నారు. అంతేకాక, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వెల్లడించారు. కానీ, ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని తమన్నా ప్రతిపాదించగా, విజయ్ మాత్రం అందుకు సుముఖత చూపలేదట. ప్రస్తుతం పెళ్లి ఆలోచన లేదని, కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు విజయ్ చెప్పినట్లు సమాచారం. దీంతో వీరి మధ్య విభేదాలు తలెత్తి, చివరకు విడిపోయినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, బ్రేకప్ గురించి వీరిద్దరూ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Advertisement


