సంక్రాంతికి వేట్టువం | Director P Ranjith Massive Pan-India Action Film Vettuvam Set for 2027 Sankranthi Release | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి వేట్టువం

Nov 2 2026 3:59 AM | Updated on Nov 2 2026 3:59 AM

Director P Ranjith Massive Pan-India Action Film Vettuvam Set for 2027 Sankranthi Release

విభిన్న సమూహాల మధ్య ఉండే సంఘర్షణలు, పోరాటాలు, ఊహకందని సంఘటనల సమాహారంతో రూపొందుతున్న చిత్రం ‘వేట్టువం’. పా. రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆర్య, వీఆర్‌ దినేష్, శోభిత ధూళిపాళ్ల, కలైయరస్, మైమ్‌ గోపి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ పాన్‌ ఇండియా  మూవీని 2027 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ తెలిపారు.

ఎస్‌. సాయి దేవానంద్, ఎస్‌. సాయి వెంకటేశ్వరన్, పా. రంజిత్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘పాన్‌ ఇండియన్‌ స్థాయిలో భారీ యాక్షన్‌ మూవీగా ‘వేట్టువం’ని రూపొందిస్తున్నాం. ఈ సినిమా నేపథ్యాన్ని, పాత్రల స్వభావాలను వివరిస్తూ ఇటీవల రిలీజ్‌ చేసిన ‘వరల్డ్‌ ఆఫ్‌ వేట్టువం’ వీడియోకు మంచి స్పందన లభించింది. ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్న ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చేలా ఉంటుంది’’ అని మేకర్స్‌ పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement