'అందుకే అప్పుడలా మాట్లాడా.. నటుడితో డేటింగ్‌పై శోభిత' | Actress Sobhita Dhulipala Reacts To Her Old Dating Comments, Reveals Why Her Views Changed, Read Story Inside | Sakshi
Sakshi News home page

Sobhita Dhulipala: 'అందుకే అప్పుడలా మాట్లాడా.. నటుడితో డేటింగ్‌పై శోభిత'

Oct 13 2026 1:32 PM | Updated on Oct 13 2026 1:48 PM

Tollywood actress Sobhita Dhulipala about Her old dating comments

నాగచైతన్య సతీమణి, హీరోయిన్ శోభిత దూళిపాల ఆసక్తికర కామెంట్స్ చేసింది. గతంలో డేటింగ్‌పై తాను చేసిన వ్యాఖ్యలపై తాజాగా స్పందించింది. ఒక నటుడితో తానెప్పుడు డేటింగ్ చేయనని మాట్లాడింది. ఆ సమయంలో తన ఆలోచనల కారణంగానే అలా మాట్లాడానని తెలిపింది. కానీ ఆ తర్వాత తనలో ఆలోచనలో మార్పులు వచ్చాయని పేర్కొంది. 

(ఇది చదవండి: 'ఆ తెలుగు సినిమా అంటే పిచ్చి.. 50 సార్లు చూశా')

శోభిత మాట్లాడుతూ.. 'ఏజ్ పెరిగే కొద్ది మన ఆలోచనల్లో మార్పులు సహజం. అప్పుడు నా చుట్టూ ఉన్న పరిస్థితుల కారణంగా అలా చెప్పాను. ఆ తర్వాత పరిస్థితులకు అనుగుణంగా మారడం, అభిప్రాయాన్ని మార్చుకోవడంలో ఎలాంటి తప్పులేదు. ఎప్పుడూ ఒకేలా ఆలోచించేవారు నా దృష్టిలో పరిస్థితులకు భయపడినట్లే. జీవితంలో ఎలాంటి మార్పునైనా స్వీకరించడానికి రెడీగా ఉన్నా. ప్రేమంటే కేవలం ఇద్దరి మధ్య రిలేషన్ మాత్రమే కాదు. ఇద్దరి మనసుల కలయిక. కేవలం రొమాన్స్‌ మాత్రమే ప్రేమ నేను భావించను' అని చెప్పుకొచ్చింది. కాగా.. శోభిత ధూళిపాళ్ల- నాగచైతన్య 2024లో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్‌గా జరిగింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement