ఇలాంటి కామెంట్స్ తీవ్ర నిరాశ కలిగిస్తాయి: అక్కినేని కోడలు శోభిత | Sobhita Dhulipala Slams Trolling Over Katrina Kaif Postpartum Weight Gain, Says Women Face Unfair Body Shaming | Sakshi
Sakshi News home page

Sobhita Dhulipala: ఇలాంటి కామెంట్స్‌తో తీవ్ర నిరాశ: శోభిత

Sep 29 2026 4:26 PM | Updated on Sep 29 2026 4:49 PM

Sobhita Dhulipala supports Katrina Kaif amid postpartum trolling

అక్కినేని కోడలు, నాగచైతన్య సతీమణి ప్రస్తుతం కోలీవుడ్‌లో ఓ మూవీ చేస్తోంది. పా రంజిత్ డైరెక్షన్‌లో వస్తోన్న వెట్టువంలో కనిపించనుంది. ఇటీవల టీజర్ గ్లింప్స్ రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు ఆర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా  ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల కానుంది. ఈ సంగతి పక్కనపెడితే శోభిత తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా కత్రినా కైఫ్‌ను ఉద్దేశించి వచ్చిన ట్రోల్స్‌పై స్పందించింది.  

మహిళ శరీరంపై ట్రోలింగ్ చేయడంపై శోభిత మండిపడ్డారు. ప్రసవానంతరం కత్రినా కైఫ్ బరువు పెరగడం సాధారణంగా జరిగే విషయమని తెలిపారు. మహిళలపై తరచుగా వచ్చే విమర్శలను ప్రతిఒక్కరూ వేర్వేరుగా ఎదుర్కొంటారని శోభిత అన్నారు. ఇలాంటి విమర్శలు రావడం ఒక మహిళగా నిరాశకు గురి చేస్తాయని వెల్లడించారు. మనమందరం మనుషులమేనని.. మనకు అర్థవంతంగా అనిపించే రీతిలో వాటిని ఎదుర్కొంటామని శోభిత తెలిపింది.

శోభిత మాట్లాడుతూ..'మహిళలు మరింత బలంగా ఉండాలని, సున్నితంగా ఉండాలని చాలా రకాలుగా ఆశిస్తారు.  కానీ భిన్నమైన మహిళలు ఇలాంటి విషయాలను వేర్వేరుగా ఎదుర్కొంటారు. కాబట్టి వీటికి సాధారణ రూల్ అంటూ ఏదీ లేదు.  ప్రజల విమర్శలు నిరాశ కలిగిస్తాయని అనుకుంటే.. అది చాలా మందికి అలానే ఉంటుందని కచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మనమందరం మనుషులమే. మనకు అర్థవంతంగా అనిపించే రీతిలో మనం దానిని ఎదుర్కొంటాం" అని అన్నారు.

కత్రినాకు బాలీవుడ్ మద్దతు

కాగా.. ట్రోల్స్ విషయంలో శోభిత కంటే ముందే పరిణీతి చోప్రా, కత్రినాకు మద్దతుగా నిలిచారు. ఆమెను ట్రోల్ చేస్తున్న వారిని విమర్శించారు. ప్రసవం తర్వాత మహిళల శరీరాల గురించి చేసే వ్యాఖ్యలు అవివేకమని అన్నారు.  గర్భం, ప్రసవం వల్ల కలిగే మార్పులను ప్రతికూలంగా చూస్తారని పరిణీతి తెలిపారు. ఒక మహిళ బిడ్డకు జన్మనిచ్చిందనడానికి స్ట్రెచ్ మార్క్స్ ఒక గుర్తుగా ఉంటాయని తాను భావిస్తానన్నారు. ఇలాంటి మార్పులను విమర్శించడం కాకుండా.. ఒక వేడుకగా జరుపుకోవాలని సూచించారు. కత్రినాపై వచ్చిన ట్రోల్స్‌ను సల్మాన్ ఖాన్ కూడా ఖండించారు. కాగా.. కత్రినా కైఫ్‌.. నవంబర్ 2025లో  విహాన్‌కు జన్మనిచ్చింది. ఇటీవలే ఆమె అంబానీ కుటుంబం నిర్వహించిన గణేష్ చతుర్థి వేడుకలో కనిపించింది. ఆ తర్వాతే ఆమె బరువు పెరగడంపై ట్రోల్స్ వచ్చాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement