కూతురు పుట్టినరోజు.. ఫొటోలు షేర్‌ చేసిన అల్లరి నరేశ్‌.. | Allari Naresh Daughter Ayana Evika Edara Birthday Celebrations Photos | Sakshi
Sakshi News home page

కూతురు పుట్టినరోజు.. ఫొటోలు షేర్‌ చేసిన అల్లరి నరేశ్‌

Sep 29 2026 4:43 PM | Updated on Sep 29 2026 5:16 PM

 Allari Naresh Daughter Ayana Evika Edara Birthday Celebrations Photos

ఇటీవల ‘రంభ ఊర్వశి మేనక’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు అల్లరి నరేశ్‌. ఈ చిత్రం  సెప్టెంబర్‌ 4న విడుదలై మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇదిలా ఉండగా.. అల్లరి నరేశ్‌ గారాల పట్టి ఇవాళ పదో పుట్టినరోజు నిర్వహించుకుంటోంది. ఈ సందర్భంగా తన కుమార్తె అయాన ఏవిక ఎడార ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన అల్లరి నరేశ్‌.. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

ఈ పోస్టుపై  హీరోయిన్‌ కమ్నా జఠ్మలానీ స్పందించారు. ‘అప్పుడే డబుల్‌ డిజిట్‌లోకి వచ్చేశావా? పుట్టినరోజు శుభాకాంక్షలు. గాడ్‌ బ్లెస్‌ యూ’ అంటూ కామెంట్‌ చేశారు. దీంతో పాటు కితకితలు సినిమాలో నటించిన గీతా సింగ్‌ తనదైన శైలిలో కామెంట్‌ చేసిన పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో వీరి కామెంట్స్‌ కూడా నెట్టింట వైరల్‌గా మారింది. కాగా 2009లో ఈవీవీ సత్యనారయణ దర్శకత్వంలో వచ్చిన బెండు అప్పారావు సినిమాలో వీళ్లిద్దరూ కలిసి నటించారు.  
 

ఇదీ చదవండి: మహేశ్‌బాబు, కృష్ణ కలిసి ఫైట్‌ చేస్తే ఎలా ఉంటుదో తెలుసా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement