‘రిచ్‌’గా బస్తీ బాయ్‌ ప్రేమకథ | Rich Movie Pooja Ceremony Highlights | Sakshi
Sakshi News home page

‘రిచ్‌’గా బస్తీ బాయ్‌ ప్రేమకథ

Sep 29 2026 11:56 AM | Updated on Sep 29 2026 12:05 PM

Rich Movie Pooja Ceremony Highlights

మోహిత్‌ పెడాడ, శ్రీజిత ఘోష్‌ జంటగా రాజా నరేంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘రిచ్‌’. ‘ఎ బస్తీ బాయ్‌ లవ్‌స్టోరీ’ అనేది క్యాప్షన్‌ . బేబీ ఆరాధ్య అండ్‌ ఆదర్శ్‌ సమర్పణలో పద్మనాభ రెడ్డి, మార్గం గోపి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రాంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. గోపీ మోహన్‌ , దశరథ్, వి. సముద్ర, జి.రామ్‌ ప్రసాద్, డీఎస్‌ రావు, మిట్టపల్లి సురేందర్, ముక్కు అవినాష్‌ అతిథులుగా హాజరయ్యారు. మోహిత్‌ పెడాడ మాట్లాడుతూ–     ‘‘రాజాగారు ఈ కథ బాగా రాసుకున్నారు. ఇంట్రవెల్‌ సీక్వెన్స్‌, క్లైమాక్స్‌ చాలా బాగుంటాయి’’ అన్నారు. 

(చదవండి: హీరో-దర్శకుడి మధ్య చిచ్చు పెట్టిన తండ్రి)     

‘‘నేటి తరానికి నచ్చేలా బస్తీ బాయ్‌ లవ్‌ స్టోరీ సినిమాను తెరకెక్కిస్తున్నాం’’ అని తెలిపారు రాజా నరేంద్ర. ‘‘అక్టోబరులో రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తున్నాం’’ అని పద్మనాభ రెడ్డి చెప్పారు.‘‘పద్మనాభ రెడ్డిగారితో కలిసి మరో మూవీ నిర్మించనున్నాం’’ అని చె΄్పారు మార్గం గోపి. ‘‘రిచ్‌’ సినిమాను హిందీలోనూ రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు సహ నిర్మాత మహేంద్ర గైక్వాడ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement