హీరో-దర్శకుడి మధ్య చిచ్చు పెట్టిన తండ్రి | Sivakarthikeyan And Venkat Prabhu Issue Latest Update | Sakshi
Sakshi News home page

Sivakarthikeyan-Venkat Prabhu: ఆయన షాకింగ్ కామెంట్స్.. హీరో, డైరెక్టర్ వివరణ

Sep 29 2026 7:36 AM | Updated on Sep 29 2026 9:34 AM

Sivakarthikeyan And Venkat Prabhu Issue Latest Update

తమిళ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ సంగీత దర్శకుడు, రచయిత, దర్శకుడు గంగై అమరన్.. హీరో శివకార్తికేయన్, దర్శకుడు వెంకట్ ప్రభు మధ్య చిచ్చు పెట్టాడు. దీంతో వీళ్లిద్దరూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత జ్యోతిక నా కొడుకుని తీసుకెళ్లిపోయి ఉండొచ్చు కానీ: సూర్య తండ్రి)

మానాడు, గోట్ తదితర సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు వెంకట్ ప్రభు.. హీరో శివకార్తికేయన్‌తో ఓ సినిమా చేస్తున్నట్లు చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు.‌ ఈ ప్రాజెక్ట్ కోసం అమెరికా వెళ్లి సాంకేతికపరమైన కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని వచ్చారు. మరి ఏమైందో ఏమో గానీ ఆ మూవీ ఇప్పటి వరకు సెట్స్ పైకి వెళ్లలేదు. దీనికి కారణం శివకార్తికేయన్‌ అని వెంకట్‌ ప్రభు తండ్రి, సీనియర్‌ సంగీత దర్శకుడు, రచయిత, దర్శకుడు గంగై అమరన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న గంగై అమరన్.. 'ఆ నటుడు కోసం వేచి ఉండాలా? నీతో సినిమా చెస్తానని చెప్పిన తర్వాత రెండు మూవీస్ చేశాడు. ప్రస్తుతం చేస్తున్న చిత్రంతో పాటు మరొకటి కూడా చేయడానికి సిద్ధం అవుతున్నాడు. అలాంటి నటుడితో పనిచేయడం అవసరమా? మన కుటుంబానికి ఒక గౌరవం ఉంది . కథ బాగుందిగా వేరే నటుడితో చేసుకోవచ్చు' అని తన కొడుకు వెంకట్‌ ప్రభు‌ని ఉద్దేశించి మాట్లాడారు.

ఇది కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యేసరికి దర్శకుడు వెంకట్‌ ప్రభు స్పందించాడు. తండ్రిగా నా గురించి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన అలా మాట్లాడటంలోనూ అర్థముంది. కానీ నాన్నకు వాస్తవాలు పూర్తిగా తెలియవు. కాబట్టి ఆయన చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవద్దు అని శివకార్తికేయన్‌‌ని ఉద్దేశించి ట్వీట్ చేశాడు. ప్రస్తుతం మీరు నటిస్తున్న సినిమా మంచి విజయం సాధించాలి. భవిష్యత్తులో మనం కలిసి మంచి చిత్రం చేద్దాం అని రాసుకొచ్చారు.

దీంతో శివకార్తికేయన్‌ స్పందిస్తూ.. సార్‌ ఈ విషయంపై ఇంతగా బాధపడాల్సిన అవసరం లేదు. మనం తప్పకుండా కలిసి పనిచేద్దాం. నా చిత్రం సక్సెస్‌ కావాలనే ఆకాంక్షని వ్యక్తం చేసినందుకు ధన్యవాదాలు. మీరు చేసేది కూడా హిట్ కావాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశాడు. దీంతో ఈ వివాదానికి తెరపడినట్లేనా అని కోలీవుడ్ జనాలు మాట్లాడుకుంటున్నారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement