సినిమా అనేది రంగుల ప్రపంచమే కాదు, అద్దాల మేడ లాంటిది కూడా. అందులో ఉన్న వాళ్లపై పువ్వులే కాదు ఒక్కోసారి రాళ్లు కూడా పడతాయి. విమర్శలు రాళ్ల కంటే గట్టిగా హృదయాలని తాకుతాయి. హీరోయిన్ పూజా హెగ్డే ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పది పన్నెండేళ్ల క్రితం తమిళ సినిమాతో దక్షిణాదిలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తర్వాత టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లోనూ నటిస్తూ పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో క్రేజీ కథానాయకిగా వెలిగింది. తర్వాత వరస ప్లాప్స్ దెబ్బకు డీలా పడిపోయింది.
ప్రస్తుతం ఈమెకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గిపోయాయి. దుల్కర్ సల్మాన్‌కు జంటగా నటించిన శ్రీ శ్రీ చిత్రం నవంబరులో థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఈ బ్యూటీపై రూమర్స్ బాగానే వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ విషయమై స్పందించిన పూజా హెగ్డే.. ఒక్కోసారి నా గురించి వచ్చే వదంతులకు కోపమొస్తుంది. అదే టైంలో నవ్వూ వస్తుంది. నాకే తెలియని విషయాలు ఇతరులకు ఎలా తెలుస్తాయో అర్థం కావడం లేదు. నాకు సంబంధం లేని విషయాలు ఎక్కడి నుంచి పుడుతున్నాయో అని ఆశ్చర్యం కలుగుతుంది. అందుకే అలాంటి వాటి గురించి పట్టించుకోవడం మానేశాను. అలాంటివన్నీ అధిగమించి పోవాల్సిందే అని చెప్పుకొచ్చింది.


