చిరంజీవి అన్నీ చూస్తున్నారు.. కానీ ఇలా మాట్లాడుతారనుకోలేదు | Chiranjeevi Fun On Thokkesthunnaru Trolls With Faria Abdullah During Sigma Pre Release Event, Video Goes Viral | Sakshi
Sakshi News home page

Chiranjeevi: తెలుగు హీరోయిన్‌తో చిరు 'తొక్కడం' డిస్కషన్

Sep 26 2026 7:03 AM | Updated on Sep 26 2026 10:13 AM

Chiranjeevi Fun On Thokkesthunnaru Trolls With Faria Abdullah

హీరో చిరంజీవిపై ఎప్పటికప్పుడు ఏదో ట్రోల్స్ వస్తూనే ఉంటాయి. వీటిలో కొన్ని జోక్స్, మరికొన్ని సీరియస్‌వి ఉంటూనే ఉంటాయి. మిగతా వాటి సంగతేమో గానీ ఈయన చాలామంది హీరోలని, దర్శకనిర్మాతలని ఎదగనీయకుండా తొక్కేస్తున్నాడని చర్చ మాత్రం గత కొన్నేళ్ల నుంచి ఎక్కువగా సోషల్ మీడియాలో వినిపిస్తుంది. దీని గురించి ఎన్ని మీమ్స్ వచ్చాయో లెక్కలేదు. ఇప్పుడీ విషయంపై స్వయంగా చిరునే సెటైరికల్‌గా స్పందించారు.

(ఇదీ చదవండి: 'ప్యారడైజ్' నెగిటివిటీపై స్పందించిన హీరో నాని)

తమిళ స్టార్ హీరో, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ తొలిసారి దర్శకుడిగా మారి తీసిన సినిమా 'సిగ్మా'. సందీప్ కిషన్ హీరో. అక్టోబరు 02న తమిళ, తెలుగులో రిలీజ్ కానుంది. దీని ప్రీ రిలీజ్ ఈవెంట్ శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో మాట్లాడిన చిరు.. 'తొక్కడం' గురించి మాట్లాడారు.

'సిగ్మా'లో నటించిన హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి మాట్లాడుతూ.. 'విశ్వంభర'లో కలిసి డ్యాన్స్ చేసే అవకాశం మిస్ అయ్యావు. హైట్ సమస్య కానే కాదు. అసలు నువ్వే నో చెప్పావా లేదంటే నన్నేమైనా తొక్కేయాలని చూస్తున్నావా? అని చూస్తున్నావా అని తనపై తానే చిరు సెటైర్ వేసుకున్నారు. తనపై వస్తున్న ట్రోల్స్‌ని కూడా కామెడీగా మార్చేయడం చిరుకే చెల్లిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిబట్టి అర్థమైంది ఏంటంటే సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్ అన్నింటినీ చిరంజీవి కూడా చూస్తున్నారు. కానీ ఇలా మాట్లాడుతారని మాత్రం ఎవరూ ఊహించి ఉండరేమో!

(ఇదీ చదవండి: తాత–నాన్నలా జేసన్‌ గొప్ప స్థాయికి వెళ్లాలి: చిరంజీవి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement