ఓటీటీలోకి సూపర్‌స్టార్ కూతురి లవ్‌స్టోరీ.. ట్రైలర్ రిలీజ్ | Soundarya Rajinikanth’s Romantic Drama Love Series OTT Trailer And Streaming Platform Details, Watch Inside | Sakshi
Sakshi News home page

Love OTT Trailer: రొమాంటిక్ ప్రేమకథ.. ఓటీటీలోకి ఎప్పుడంటే?

Sep 26 2026 9:14 AM | Updated on Sep 26 2026 9:52 AM

Love Series OTT Trailer And Release Details

ఓటీటీల్లోకి రెగ్యులర్ సినిమాలతో పాటు అప్పుడప్పుడు ఒరిజినల్ సిరీస్‌లు కూడా వస్తుంటాయి. అలా ఇప్పుడు రొమాంటిక్ ప్రేమకథ వచ్చేందుకు సిద్ధమైంది. సూపర్‌స్టార్ కూతరు నిర్మించిన ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేసి స్టోరీ ఏంటనేది చెప్పేశారు. ఇంతకీ దీని సంగతేంటి? ఎప్పటి నుంచి ఎందులోకి రానుంది?

(ఇదీ చదవండి: శోభనం రాత్రి ఏం జరిగింది? ఓటీటీ సినిమా తెలుగు రివ్యూ)

సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు సౌందర్య రజనీకాంత్ నిర్మించడంతో పాటు షో రన్నర్‌గా వ్యవహరించిన సిరీస్ 'లవ్'. అర్జున్ దాస్, ఐశ్వర్య లక్ష‍్మి ప్రధాన పాత్రలు చేశారు. వచ్చే శుక్రవారం(అక్టోబరు 02) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేశారు.

'లవ్' ట్రైలర్ బట్టి చూస్తే తారా(ఐశ్వర్య లక్ష‍్మి) ఫౌండ్ అనే డేటింగ్ యాప్ కంపెనీ నడిపిస్తూ ఉంటుంది. డేటింగ్ యాప్ కోసం పనిచేస్తున్నప్పటికీ ఈమెకు బాయ్ ఫ్రెండ్ ఉండడు. మరోవైపు మాథ్యూ(అర్జున్ దాస్) ఓ ఇన్వెస్టర్. అనుకోకుండా మాథ్యూ.. తారా కంపెనీలో తన డబ్బుని పెట్టుబడి పెడతాడు. అయితే తనకో మంచి అమ్మాయిని చూసి పెట్టాలని అంటాడు. దీనికి 60 రోజుల ఛాలెంజ్ ఇస్తాడు. ఒకవేళ తనకు ఏ అమ్మాయి సెట్ కాకపోతే తారా తనతో డేటింగ్ చేయాలని కండీషన్ పెడతాడు. తర్వాత ఏమైంది? వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారా? లేదా అనేది మిగతా స్టోరీలా అనిపిస్తుంది.

(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement