టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ ఫాంటసీ కామెడీ జానర్‌లో నటించిన చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని ఓటీటీలోకి వచ్చేసింది. ‘రంభ ఊర్వశి మేనక’ ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈరోజు(సెప్టెంబర్ 25) నుంచి ఈ సినిమాను ఓటీటీలో వీక్షించొచ్చు. తెలుగుతో పాటు మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది.
ఇదీ చదవండి: గిన్నిస్‌కి ఎక్కిన ‘రాకా’.. ఈ రికార్డో ఏంటో తెలుసా!
చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అల్లరి నరేష్ సరసన సురభి హీరోయిన్. రాశి సింగ్, విష్ణుప్రియ భీమనేని, ప్రిషా సింగ్ ప్రధాన పాత్రలో నటించారు. వెన్నెల కిశోర్, రచ్చ రవి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన అల్లరి నరేష్ అభిమానులు, ఫాంటసీ కామెడీ సినిమాలను ఇష్టపడేవారు ఓటీటీలో ఈ చిత్రాన్ని చూడొచ్చు
కథ ఏంటంటే?
మంతెన సూర్యనారాయణ అలియాస్ సూరి (అల్లరి నరేశ్) కుటుంబం నాటకాలు వేస్తూ బతుకుతుంటుంది. వీళ్ల ఇంట్లో ఓ మ్యాజిక్ బుక్. దానిపై సరిగ్గా గీతలు గీస్తే స్వర్గం నుంచి రంభ, ఊర్వశి, మేనక వస్తారని చిన్నతంలో సూరికి తెలుస్తుంది. దీంతో ఏ పనిచేయకుండా ఊరంతా అప్పులు చేసి సదరు పుస్తకంపై 15 ఏళ్లుగా గీతలు గీస్తూనే ఉంటాడు. ఓ సందర్భంలో సూరికి తన తల్లి ప్రాణాంతక వ్యాధి బారిన పడిందని తెలుస్తుంది. అదే టైంలో ప్రేమించిన చిన్ని(సురభి) తండ్రితో ఓ చిక్కొచ్చి పడుతుంది. మరోవైపు ఓ రాత్రి చేసిన పనివల్ల నిజంగానే రంభ-ఊర్వశి-మేనకలు సూరి కోసం దిగివస్తారు. వీళ్ల రాకతో సూరి జీవితం ఎలా మారింది? ఎస్సై అప్పలనాయుడితో సూరికి గొడవేంటి? చివరకు ఏం జరిగిందనేది మిగతా స్టోరీ.
ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లోకి మరో ముగ్గురు ఎంట్రీ! ‘నీకు అసలు తెలుగు వచ్చా..?’


