శర్వానంద్, మానస వారణాసి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘జార్జ్ క్రిష్’. ఏటీవీ సమర్పణలో అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2027 సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా, గురువారం (సెప్టెంబరు 24) దర్శకుడు శ్రీను వైట్ల బర్త్ డే.
ఈ సందర్భంగా ‘జార్జ్ క్రిష్’ ఫస్ట్ బూస్టర్ పేరిట ఓ వీడియోను రిలీజ్ చేశారు. ‘‘ఈ సినిమాలో క్రిస్టియన్ జార్జ్, హిందువు క్రిష్.... ఇలా రెండు విభిన్న మతాలకు చెందిన గెటప్స్‌లో శర్వానంద్ కనిపిస్తారు. ఈ రెండు పాత్రల చుట్టూ ఉన్న విభిన్న పరిస్థితులు ఏంటి? అనే ఆసక్తిని ఆడియన్స్‌లో క్రియేట్ చేసేలా ఫస్ట్ బూస్టర్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశాం’’ అని యూనిట్ పేర్కొంది. అజయ్ సుంకర సహ–నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్.


