చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. వినాయక చవితి సందడి దాదాపు ముగిసింది. ఈ సినిమాల విషయానికొస్తే నాని హీరోగా వచ్చిన ది ప్యారడైజ్ సినీ ప్రియులను అలరిస్తోంది. అయితే ఈ మూవీ తొలిరోజే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఈ ఫ్రైడే రాగ్ మయూర్ అనుమాన పక్షి, కల్యాణం కమనీయం జీవితం లాంటి చిన్న సినిమాలు సందడి చేయనున్నాయి.
ఇక ఓటీటీల విషయానికొస్తే పలు కొత్త సినిమాలు ఈ శుక్రవారం సందడి చేయనున్నాయి. తెలుగు హారర్ థ్రిల్లర్ అగధ మూవీ, మలయాళ సినిమా మ్యాంగో పచ్చా కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. వీటితో పాటు పలు హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఈ వారంలో అలరించేందుకు వచ్చేస్తున్నాయి. మరికొన్ని చిత్రాలు సడన్ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.
నెట్‌ఫ్లిక్స్..
- ది ఫైనల్ ప్రాబ్లమ్(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 25
- యునాబాంబర్ (హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 25
- ది గాడ్ ఫాదర్ కోడా- ది డెత్ ఆప్ మైఖేల్ కర్లోన్(హాలీవుడ్)- సెప్టెంబర్ 25
- ది బ్రెడ్ విన్నర్(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 26
అమెజాన్ ప్రైమ్ వీడియో..
- డోంట్ బి షై(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 25
- ఫోటోగ్రాఫర్(తమిళ సినిమా)- సెప్టెంబర్ 25
- రంభ ఊర్వశి మేనక(తెలుగు సినిమా)- సెప్టెంబర్ 25(రూమర్ డేట్)
జియో హాట్‌స్టార్..
- హుంకార్ ది రోర్ (హిందీ సిరీస్)- సెప్టెంబర్ 25
- మ్యాంగో పచ్చా(మలయాళ మూవీ)- సెప్టెంబర్ 25
జీ5
- బకైతీ సీజన్-2(హిందీ సిరీస్)- సెప్టెంబర్ 25
- అగధ(తెలుగు సినిమా)- సెప్టెంబర్ 25
- హాయ్(తమిళ మూవీ)- సెప్టెంబర్ 25
సోనీ లివ్..
- హబీబీ(తమిళ సినిమా)- సెప్టెంబర్ 25
అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్..
- రైజ్ అండ్ ఫాల్ సీజన్-2 (హిందీ సిరీస్)- సెప్టెంబర్ 26
సన్‌నెక్ట్స్..
- అంగీకారం(తమిళ మూవీ)- సెప్టెంబర్ 25
లయన్స్ గేట్ ప్లే..
- దిస్ టెంప్టింగ్‌మ్యాడ్‌నెస్(హాలీవుడ్)- సెప్టెంబర్ 25


