రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ ముఖ్య తారలుగా నటిస్తున్న చిత్రం ‘లవ్ అండ్ వార్’. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా నుంచి రణ్‌బీర్ కపూర్ ఫస్ట్ లుక్‌ను గురువారం విడుదల చేశారు. ‘‘సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘లవ్ అండ్ వార్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రణ్‌బీర్, ఆలియా, విక్కీ వంటి ముగ్గురు స్టార్స్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. రణ్‌బీర్ ఇప్పటివరకు కనిపించని కొత్త పాత్రలో కనిపించడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. సంజయ్ లీలా సినిమాల్లో కనిపించే గ్రాండ్ విజువల్స్, రిచ్‌నెస్ ఈ సినిమాలోనూ స్పష్టంగా కనిపిస్తాయి. సంగీతం విషయంలోనూ భన్సాలీ మార్క్ మరోసారి కనిపిస్తుంది. ఈ సినిమాని 2027 జనవరి 21న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.


