కథలు రాస్తున్నాను: ఫరియా అబ్దుల్లా | Faria Abdullah is reportedly planning to turn director soon | Sakshi
Sakshi News home page

కథలు రాస్తున్నాను: ఫరియా అబ్దుల్లా

Sep 25 2026 4:29 AM | Updated on Sep 25 2026 4:29 AM

Faria Abdullah is reportedly planning to turn director soon

‘‘సిగ్మా’ నా తొలి తమిళ సినిమా. లైకా వంటి పెద్ద నిర్మాణ సంస్థలో అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. యాక్షన్‌ అడ్వెంచరస్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ మూవీ ఇది. ఇందులో రేడియో జాకీగా చేశాను. ఈ సినిమాలో మంచి భావోద్వేగాలు పలికించే అవకాశం దొరికింది’’ అని ఫరియా అబ్దుల్లా తెలిపారు. సందీప్‌ కిషన్‌ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించిన చిత్రం ‘సిగ్మా’. జేసన్‌ సంజయ్‌ దర్శకత్వంలో లైకా ప్రోడక్షన్స్ పై తెలుగు–తమిళ భాషల్లో సుభాస్కరన్‌ నిర్మించిన ఈ మూవీ అక్టోబరు 2న విడుదల కానుంది.

 మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ కోస్తాంధ్ర, తెలంగాణలో విడుదల చేయనుండగా, ఎన్‌వీఆర్‌ సినిమా సీడెడ్‌లో రిలీజ్‌ చేస్తోంది. గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ– ‘‘సిగ్మా’ కథని జేసన్‌ జూమ్‌ కాల్‌లో చెప్పారు. కథ మొత్తం విన్న తర్వాత ‘మీ వయసు ఎంత?’ అని అడిగాను. 24 ఏళ్లు అని చెప్పడంతో ఆశ్చర్యపోయాను. తను స్టార్‌ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ సార్‌ అబ్బాయి అయినప్పటికీ అందరితో ఫ్రెండ్లీగా కలిసిపోతారు.

 డైరెక్టర్‌గా తొలి సినిమా అయినప్పటికీ ఎంతో క్లారిటీగా తీశారు. సందీప్‌ కిషన్‌నాకు ఎప్పటి నుంచో తెలుసు. మేమిద్దరం కలిసి ఒక సినిమా చేయాలనుకున్నాం. ‘సిగ్మా’తో కుదిరింది. మైత్రి మూవీ మేకర్స్‌ ఈ సినిమాను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. 

మా మూవీ ట్రైలర్‌ని డైరెక్టర్‌ రాజమౌళిగారు రిలీజ్‌ చేసి, మంచి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌లా ఉంది అని చెప్పారు. ‘సిగ్మా’లాంటి మంచి సినిమాతో తమిళ్‌లో పరిచయం కావడం సంతోషంగా ఉంది. తమిళ్‌లో మరికొన్ని కథలు విన్నాను. నాకు దర్శకత్వం చేయాలని ఉంది. ప్రస్తుతం కథలు రాస్తున్నాను. నేను దర్శకత్వం వహించే సినిమాలో నేనే నటిస్తాను’’ అని పేర్కొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement