తొలిరోజు ‘ది ప్యారడైజ్‌’ విధ్వంసం.. దుమ్మురేపుతున్న కలెక్షన్స్‌ | Nani The Paradise Movie First Day World Wide Box Office Collections Details, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

The Paradise Movie Collections: తొలిరోజు ‘ది ప్యారడైజ్‌’ కలెక్షన్స్‌ ఎంతంటే?

Sep 25 2026 8:57 AM | Updated on Sep 25 2026 10:45 AM

Nani The Paradise Movie First Day Box Office Collections

భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేచురల్ స్టార్ నాని సినిమా ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ సంపాదించుకుంది. అయినప్పటికీ  కలెక్షన్ల విషయంలో మాత్రం జోరు చూపిస్తోంది. ఫస్ట్ డే వసూళ్లతో నాని కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచినట్లు తెలుస్తోంది.

 ‘ది ప్యారడైజ్’ తొలి రోజు ఇండియాలో రూ.88 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే ట్రేడ్ ట్రాకర్ సాక్నిల్క్ ప్రకారం..దేశవ్యాప్తంగా 47 శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో నాని గత చిత్రాలు ‘దసరా’, ‘హిట్: ది థర్డ్ కేస్’ ఫస్ట్ డే వసూళ్లను ఈ మూవీ అధిగమించిందట. గతంలో నాని నటించిన ‘దసరా’ ఫస్ట్ డే దాదాపు రూ.23.20 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించగా.. ‘హిట్: ది థర్డ్ కేస్’ రూ.21 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. వీటితో పోలిస్తే ‘ది ప్యారడైజ్’ భారీ ఓపెనింగ్ నమోదు చేసిందనే చెప్పాలి.  వీకెండ్ కావడంతో శని, ఆదివారాల్లో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ‘రంభ ఊర్వశి మేనక’..

కాగా.. ‘ది ప్యారడైజ్’లో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించింది. సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, సంపూర్ణేశ్ బాబు, రాఘవ్ జుయల్, ఈశ్వరీ రావు, తనికెళ్ల భరణి, రాజా రవీంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. కీర్తి సురేశ్ కూడా ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో మెరిసింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. సుధాకర్ చెరుకూరి నిర్మించారు.
ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లోకి మరో ముగ్గురు ఎంట్రీ! ‘నీకు అసలు తెలుగు వచ్చా..?’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement