భారీ విస్తరణ బాటలో ఉన్న అపోలో హాస్పిటల్స్ డైరెక్టరుగా (ప్రాజెక్ట్స్) ఉపాసన కామినేని కొణిదెల నియమితులయ్యారు. దేశవ్యాప్తంగా కొత్త ఆస్పత్రులను ఏర్పాటు చేయడం, ప్రస్తుత హాస్పిటల్స్‌ను అప్‌గ్రేడ్ చేయడం తదితర అంశాలకు సంబంధించిన ప్రణాళికలను ఆమె పర్యవేక్షించనున్నారు.
ప్రపంచ స్థాయి వైద్య సేవలు దేశీయంగా ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో తమ తాతగారు ప్రతాప్ సి.రెడ్డి అపోలో హాస్పిటల్స్‌ని నిర్మించారని, దాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లడం తమ లక్ష్యమని ఉపాసన తెలిపారు. ప్రస్తుతం సంస్థ సీఎస్‌ఆర్ విభాగానికి వైస్ చైర్‌పర్సన్‌గా అమె వ్యవహరిస్తున్నారు. అపోలో హాస్పిటల్స్ దాదాపు రూ. 8,600 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్, చెన్నై, ముంబై సహా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో కార్యకలాపాలు విస్తరిస్తోంది.
ఇదీ చదవండి: భారత్‌లో అత్యంత సంపన్న నటులు వీరే..


