నా కాళ్లపై ఎందుకు పడతారు?.. అనిల్ రావిపూడి తీవ్ర అసహనం | Director Anil Ravipudi Disappoints a Fan Touched His feet at event | Sakshi
Sakshi News home page

Anil Ravipudi: 'మీకో దండం.. నా కాళ్లపై పడొద్దు'.. వీడియో వైరల్

Sep 22 2026 4:24 PM | Updated on Sep 22 2026 4:24 PM

Director Anil Ravipudi Disappoints a Fan Touched His feet at event

టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తీవ్ర అసహనానికి గురయ్యారు. ఆయన ఓ మూవీ లాంచింగ్‌ ఈవెంట్‌కు రాగా.. అక్కడే ఉన్న ఓ ‍అభిమాని అనిల్ కాళ్లకు నమస్కరించబోయాడు. ఇది చూసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. నా కాళ్లపై ఎందుకు పడతారంటూ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దయచేసి ఇలాంటి పనులు చేయవద్దని అక్కడున్న వారందరికీ దండం పెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక సినిమాల విషయానికొస్తే అనిల్ రావిపూడి ఈ ఏడాది మనశంకరవరప్రసాద్‌గారుతో హిట్ కొట్టారు. సంక్రాంతికి వచ్చిన ఈ మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది. మళ్లీ వచ్చే ఏడాది మరో ఫుల్ ఫన్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వెంకటేశ్, కల్యాణ్ రామ్‌తో కలిసి జనవరి 12న విడుదల మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కృతిశెట్టి, కీర్తి సురేశ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే మూవీ సెట్‌లో కృతిశెట్టి బర్త్‌ డే వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement