ప్రశ్న విని పగలబడి నవ్విన హీరోయిన్‌ | Anaswara Rajan Laughed At Reporters Silly Questions | Sakshi
Sakshi News home page

Anaswara Rajan: ఆ ప్రశ్నకు నవ్వే సమాధానం అయింది..

Sep 22 2026 3:04 PM | Updated on Sep 22 2026 3:04 PM

Anaswara Rajan Laughed At Reporters Silly Questions

అనీశ్‌, అనస్వర రాజన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. మహేశ్‌ ఉప్పల దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు వెంకీ కుడుముల నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబరు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆమెకు ఎదురైన ఓ వింత ప్రశ్న నవ్వులు పూయించింది. ఇది ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

ఇంతకంటే మంచి రియాక్షన్ ఉండదు..
‘యాక్టర్‌గా మీ హిస్ట్రియానిక్స్‌(నటన, హావాభావాలు)పై ఎలా కామెంట్ చేస్తారు?’ అంటూ ఓ జర్నలిస్ట్‌ అనస్వర రాజన్‌ను ప్రశ్నించాడు. ఈ ప్రశ్న విన్న వెంటనే ఆమె ఒక్కసారిగా అవాక్కై.. ఆ తర్వాత నవ్వడం మొదలుపెట్టింది. పక్కనే ఉన్న సాయి అనీష్‌ కూడా నవ్వడంతో అక్కడి వాతావరణం సరదాగా మారిపోయింది. అనస్వర రియాక్షన్‌కు ప్రేక్షకులు కూడా చప్పట్లతో స్పందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు అనస్వర సహజమైన రియాక్షన్‌ను మెచ్చుకుంటున్నారు. అసలు ఆ ప్రశ్న ఎందుకు అడిగారంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ‘ఆ ప్రశ్నకు ఇంతకంటే మంచి రియాక్షన్ ఉండదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సినిమాల విషయానికి వస్తే..
ఇక అనస్వర రాజన్‌ ఇప్పటికే ‘సూపర్ శరణ్య’తో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. తన సహనటి మమిత బైజుతో తనకున్న స్నేహం గురించి కూడా ఆమె ఇటీవల మాట్లాడింది. మమిత సినిమాలు మంచి విజయం సాధిస్తుండటంపై సంతోషంగా ఉందని, తామిద్దరం ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటామని తెలిపింది. ‘ఇట్లూ అర్జున’తో పాటు అనస్వర ‘కాకా’ సినిమాలోనూ నటిస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవికి కుమార్తెగా కనిపించనుంది. సంక్రాంతి సందర్భంగా 2027 జనవరి 13న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement