అప్పుడెప్పుడో చిరంజీవి కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం ‘పునాది రాళ్లు’. అయితే.. ఆ తర్వాత నటించిన ‘ప్రాణం ఖరీదు’ ముందుగా విడుదలైంది. కె.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరు నరసింహ అనే పాత్రను పోషించారు. అయితే చిరంజీవి హీరోగా నటించిన ‘ప్రాణం ఖరీదు’ విడుదలై నేటికి 48 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
అభిమానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
‘ఈ 48 ఏళ్లలో ఎన్నో పాత్రలు పోషించాను. ఎన్నో విజయాలను చూశాను. ఎన్నో అవార్డులు, గౌరవాలు అందుకున్నాను. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నన్ను నమ్మి అవకాశాలు ఇచ్చిన ప్రతి నిర్మాతకు, నాలోని నటుడిని కొత్త కొత్త కోణాల్లో ఆవిష్కరించిన ప్రతి దర్శకుడికి, నా ప్రతి సినిమా వెనుక అహర్నిశలు శ్రమించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి సహకారమే నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. అయితే ఆ విజయాలన్నింటికంటే గొప్పది… మీరు నాపై చూపించిన ప్రేమ. ఆ గౌరవాలన్నింటికంటే విలువైనది… మీ హృదయాల్లో నాకు ఇచ్చిన స్థానం. నన్ను మీ కుటుంబ సభ్యుడిగా భావించి, ఇంతటి అపూర్వమైన ప్రేమాభిమానాలను అందించిన ప్రతి ఒక్క అభిమానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే..
చిరంజీవి హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ కాకా. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ ఇటీవలే ప్రకటించి గ్లింప్స్‌ను విడుదల చేశారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న రెండో చిత్రం కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. మరో పక్క ‘విశ్వంభర’ సినిమాలోనూ నటిస్తున్నారు.
22 సెప్టెంబర్ 1978
ఆరోజు మొదలైన నా సినీ ప్రయాణం నేటితో 48 వసంతాలు పూర్తి చేసుకుంది.
ఈ 48 ఏళ్లలో ఎన్నో పాత్రలు పోషించాను. ఎన్నో విజయాలను చూశాను. ఎన్నో అవార్డులు, గౌరవాలు అందుకున్నాను.
ఈ సుదీర్ఘ ప్రయాణంలో నన్ను నమ్మి అవకాశాలు ఇచ్చిన ప్రతి నిర్మాతకు, నాలోని నటుడిని కొత్త కొత్త… pic.twitter.com/5wBJnXl3MP
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 22, 2026


