‘కంటెస్టెంట్‌గా పనికిరావు.. బయటకెళ్లి..’ | Bigg boss Season 10 Telugu Day 16 Promo | Sakshi
Sakshi News home page

Bigg boss Promo: బిగ్‌బాస్‌లో బిగ్‌ ఫైట్‌.. నువ్వా.. నేనా..

Sep 22 2026 12:16 PM | Updated on Sep 22 2026 12:19 PM

Bigg boss Season 10 Telugu Day 16 Promo

బిగ్‌బాస్‌ ఇంట్లో మూడో వారం నామినేషన్స్‌ హీట్‌ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే కంటెస్టెంట్ల మధ్య చిన్నచిన్న గొడవలు జరుగుతుండగా.. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే ఈరోజు ఎపిసోడ్‌లో నామినేషన్స్‌ మరింత రసవత్తరంగా సాగనున్నట్లు తెలుస్తోంది. ‘నువ్వా.. నేనా’ అన్నట్లుగా కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం జరిగినట్లు ప్రోమోలో కనిపించింది.

అసలు నువ్వు కంటెస్టెంట్‌గానే పనికిరావు..
గేమ్‌ను సీరియస్‌గా తీసుకోని వాళ్లే బజర్‌ మోగిన తర్వాత కూడా బోర్డుపై రాస్తారంటూ ముఖేశ్‌ వ్యాఖ్యానించాడు. దీనికి స్పందించిన చరణ్‌.. ‘ఈ విషయాన్ని నేను ఆడియన్‌గా బయట నుంచి చూశా’ అని చెప్పాడు. దీంతో ముఖేశ్‌ మరింత ఫైర్‌ అయ్యాడు. ‘అసలు నువ్వు కంటెస్టెంట్‌గానే పనికిరావు.. వెళ్లి ఆడియన్‌గానే ఉండు పో’ అంటూ ఘాటుగా బదులిచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.

మాట్లాడే దమ్ము లేదా..
మరోవైపు షాలిని, వర్షిణి మధ్య కూడా వివాదం తారస్థాయికి చేరినట్లు ప్రోమోలో కనిపించింది. ఇద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో ముఖేశ్‌ మధ్యలో కలగజేసుకోవడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. ‘ఏంటి.. ముఖేశ్‌తో మాట్లాడే దమ్ము లేదా?’ అంటూ షాలినిని వర్షిణి ప్రశ్నించింది. దీనికి షాలిని కూడా గట్టిగానే స్పందించింది. ఇలా ఒకవైపు ముఖేశ్‌-చరణ్‌ మధ్య మాటల యుద్ధం.. మరోవైపు షాలిని-వర్షిణి మధ్య వివాదంతో మూడో వారం నామినేషన్స్‌ మరింత హాట్‌గా మారాయి. మరి ఈ గొడవలు ఎక్కడి వరకు వెళ్తాయి? ఎవరు ఎవరిని నామినేట్‌ చేయబోతున్నారు? నామినేషన్స్‌లో ఎలాంటి ట్విస్టులు చోటుచేసుకోనున్నాయి? అనేది తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్‌ చూడాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement