పాండా అంటూ ట్రోలింగ్‌.. కృష్ణుడు ఎలిమినేట్‌..? | Panda Trolling Goes Viral Is Krishnudu the Next Bigg Boss 10 Elimination | Sakshi
Sakshi News home page

Bigg Boss Krishnudu: చైత్ర తర్వాత కృష్ణుడేనా..? ఎలిమినేషన్ టాక్‌

Sep 20 2026 8:29 AM | Updated on Sep 20 2026 8:48 AM

Panda Trolling Goes Viral Is Krishnudu the Next Bigg Boss 10 Elimination

బిగ్‌బాస్‌ సీజన్‌ 10లో ఎలిమినేషన్‌ హీట్‌ కొనసాగుతోంది. ఇప్పటికే చైత్ర హౌస్‌ నుంచి బయటకు వెళ్లగా.. ఇప్పుడు తదుపరి ఎలిమినేషన్‌పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న టాక్‌ ప్రకారం.. ఈసారి కృష్ణుడి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో చైత్ర తర్వాత కృష్ణుడే బయటకు వెళ్తాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కృష్ణుడి ఆటపై అసంతృప్తి..
నిన్నటి ఎపిసోడ్‌లో బిగ్‌బాస్‌ కృష్ణుడు, సృష్టిల ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. గత వీకెండ్‌లో వారు ఎలా ఆడారో ప్రేక్షకుల్లా కూర్చొని చూడాలని చెబుతూ ఇద్దరినీ స్టోర్‌ రూంలో కూర్చోబెట్టాడు. దీంతో పాటు ప్రేక్షకులు సైతం కృష్ణుడుని అన్‌ సేఫ్‌లోనే ఉంచారు. దీంతో కృష్ణుడి ఆటతీరుపై బిగ్‌బాస్‌ కూడా ఫోకస్‌ పెట్టాడనే చర్చ మొదలైంది.
నెటిజన్లు మీమ్‌ వీడియోలు..
మరోవైపు హౌస్‌లో కృష్ణుడి ఆట కూడా పెద్దగా హైలైట్‌ కావడం లేదనే అభిప్రాయాలు సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో దేబ్జానీ.. కృష్ణుడిని పాండాతో పోలుస్తూ చేసిన కామెంట్‌ కూడా వైరల్‌గా మారింది. ఆ మాటను ఆధారంగా చేసుకుని నెటిజన్లు మీమ్‌ వీడియోలు రూపొందిస్తున్నారు. దీంతో కృష్ణుడిపై సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ కూడా కనిపిస్తోంది.వినాయకుడి నిమార్జనానికి వేళైంది అంటూ ట్రోల్స్‌ చేస్తున్నారు.
గతంలో చైత్ర విషయంలోనూ..
గతంలో చైత్ర విషయంలోనూ ఇలాంటి చర్చే మొదలై.. చివరకు ఆమె ఎలిమినేట్‌ అయింది. ఇప్పుడు అదే తరహాలో కృష్ణుడి పేరు వినిపిస్తుండటంతో ఈసారి ఏం జరుగుతుందన్న ఆసక్తి పెరిగింది. అయితే సోషల్‌ మీడియాలో జరుగుతున్న ఈ చర్చ నిజమైన ఎలిమినేషన్‌ ఫలితమా? లేక కేవలం ప్రేక్షకుల అంచనా మాత్రమేనా? అనేది తెలియాలంటే ఎలిమినేషన్‌ ఎపిసోడ్‌ వరకు వేచి చూడాల్సిందే.

(ఇదీ చదవండి: ఒకేసారి రెండు ఓటీటీల్లోకి హారర్‌ థ్రిల్లర్‌.. డోంట్‌ మిస్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement