అక్టోబరులో పూర్తి | Mahesh Babu Varanasi to Complete Shooting by October | Sakshi
Sakshi News home page

అక్టోబరులో పూర్తి

Sep 20 2026 4:06 AM | Updated on Sep 20 2026 4:06 AM

Mahesh Babu Varanasi to Complete Shooting by October

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ‘వారణాసి’ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. రాజమౌళి దర్శకత్వంలో కేఎల్‌ నారాయణ, ఎస్‌ఎస్‌ కార్తికేయ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న విడుదల కానుంది. ఇందులో రుద్ర, శ్రీరాముడు.. ఇలా రెండు పాత్రల్లో కనిపించనున్నారు మహేశ్‌బాబు. 

మందాకినిగా ప్రియాంకా చోప్రా, విలన్  కుంభగా పృథ్వీరాజ్‌ సుకుమారన్  నటిస్తుండగా, ప్రకాష్‌రాజ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. 90 శాతానికి పైగా షూటింగ్‌ పూర్తయిందని తెలిసింది. ‘వారణాసి’లో తన వంతు షూట్‌ను పూర్తి చేయడానికి మహేశ్‌బాబు 15 రోజులు షూటింగ్‌లో పాల్గొంటే సరిపోతుందట. అక్టోబరు కల్లా మొత్తం చిత్రీకరణ పూర్తవుతుందని ఇటీవల ఓ కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ కార్తికేయ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement