వరంగల్ ఎయిర్‌పోర్టుపై సందీప్ వంగా, సీఎం రేవంత్ ట్వీట్లు | Sandeep Reddy Vanga and CM Revanth Reddy tweets about Warangal Airport | Sakshi
Sakshi News home page

‘దట్స్ ది స్పిరిట్’.. వరంగల్ ఎయిర్‌పోర్టుపై సందీప్ వంగా, సీఎం రేవంత్ ట్వీట్లు

Sep 19 2026 11:39 PM | Updated on Sep 19 2026 11:47 PM

Sandeep Reddy Vanga and CM Revanth Reddy tweets about Warangal Airport

సాక్షి,వరంగల్: వరంగల్ మామునూరు విమానాశ్రయానికి పేరు పెట్టే అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. ఈ కొత్త ఎయిర్‌పోర్టుకు పేరు సూచించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌ వేదికగా కోరగా.. దానికి టాలీవుడ్ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా స్పందించారు.

తన సొంత ప్రాంతమైన వరంగల్‌లో విమానాశ్రయం ఏర్పాటు కానుండటంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఎయిర్‌పోర్టుకు ‘రుద్రమ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (RIA)’, ‘కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (KIA)’ పేర్లను సూచించారు. వరంగల్ చారిత్రక నేపథ్యాన్ని ప్రతిబింబించేలా ఎయిర్‌పోర్ట్ పేరు ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టు ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

దాంతో సందీప్‌రెడ్డి వంగా ట్వీట్‌కు సీఎం రేవంత్‌రెడ్డి “That’s the spirit” అంటూ స్పందించారు. ప్రస్తుతం రెబల్‌స్టార్‌ ప్రభాస్‌తో సందీప్‌రెడ్డి వంగా 'స్పిరిట్' సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దాంతో సీఎం రిప్లైలో 'స్పిరిట్' అనే పదం ఉండటం సినీ అభిమానుల దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించింది.
 

మామునూరు ఎయిర్‌పోర్టు అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో చర్చలు కొనసాగిస్తోంది. ఈ నెల 2న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడితో సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి భూసేకరణ పూర్తయి, భూమిని ఏఏఐకి అప్పగించినట్లు తెలిపారు. టెండర్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేసి డిసెంబరులో పనులకు శంకుస్థాపన చేసేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి తెలిపినట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement