హైదరాబాద్‌లో భారీ వర్షం | Heavy rain in several parts of Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో భారీ వర్షం

Sep 19 2026 6:11 PM | Updated on Sep 19 2026 6:23 PM

Heavy rain in several parts of Hyderabad

హైదరాబాద్‌లో భారీవర్షం పడుతోంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌తో పాటు పలు ప్రాంతాలలో కుండపోతగా వాన కురుస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న రెండు గంటల పాటు హైదరాబాద్‌కు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీగా వాన కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో వర్షాలు దంచికొట్టాయి. సూర్యాపేట,రంగారెడ్డి, జగిత్యాల, వికారాబాద్‌, జిల్లాల్లో పెద్దఎత్తున వర్షం పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement