ఎగసిపడుతున్న మంటలు.. కొనసాగుతున్న సహాయక చర్యలు | Massive Fires have been raging for three hours at Mailardevpally | Sakshi
Sakshi News home page

ఎగసిపడుతున్న మంటలు.. కొనసాగుతున్న సహాయక చర్యలు

Nov 8 2026 8:27 PM | Updated on Nov 8 2026 8:40 PM

Massive Fires have been raging for three hours at Mailardevpally

సాక్షి, రంగారెడ్డి జిల్లా: పండగ వేళ రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ మండలం మైలార్‌దేవపల్లిలోని పారిశ్రామికవాడలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. సాయంత్రం 4:40 గంటల సమయంలో ఓ ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పక్కనే ఉన్న ప్లైవుడ్ గోదాంకు వ్యాపించడంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి.

దాంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సుమారు మూడు గంటలుగా మంటలు కొనసాగుతుండటంతో పారిశ్రామికవాడలో తీవ్ర ఆందోళన నెలకొంది. కాగా అగ్నిప్రమాదం జరిగిన అరగంట తర్వాత ఫైర్ ఇంజన్ ఘటనా స్థలానికి చేరుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, జరిగిన ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: ఇరాన్‌తో యుద్ధానికి ముగింపు.. చైనా సాయం కోరుతున్న అమెరికా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement