ఇరాన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు చైనా సాయం కోరుతున్న అమెరికా? | Is America Turning To China To Find An Off-Ramp From Iran War | Sakshi
Sakshi News home page

ఇరాన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు చైనా సాయం కోరుతున్న అమెరికా?

Nov 8 2026 6:03 PM | Updated on Nov 8 2026 6:14 PM

Is America Turning To China To Find An Off-Ramp From Iran War

వాషింగ్టన్: ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా దౌత్య ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇరాన్‌పై ప్రభావం చూపగల చైనాను రంగంలోకి దించినట్లు సమాచారం. చైనా తన పలుకుబడిని ఉపయోగించి ఇరాన్‌ను చర్చలకు ఒప్పించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరినట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనం వెల్లడించింది.

అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ కూడా ఈ దిశగా బీజింగ్‌కు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అంతేకాదు అమెరికా సందేశాన్ని చైనా ఇప్పటికే ఇరాన్‌కు చేరవేసినట్లు ఆ కథనం పేర్కొంది. ఇటీవల వాషింగ్టన్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో జరిగిన సమావేశంలోనూ ట్రంప్ ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఆ సమావేశంలో ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండకూడదన్న అభిప్రాయంతో జిన్‌పింగ్ కూడా ఏకీభవించినట్లు సమాచారం.

ఇక మరోవైపు ఖతార్ దేశం కూడా ఇప్పటికే అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వ ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ఇరుదేశాలు యుద్ధాన్ని ముగించేందుకు సానుకూల పరిష్కారానికి రావాలని ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ అల్ థానీ కోరారు. ఇరుదేశాలు శాంతి ఒప్పందానికి రావాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉండగా హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్ ఏడు రోజుల ప్రణాళికను ప్రతిపాదిస్తోంది. ఇందులో భాగంగా అమెరికా తమ ఓడరేవులపై ఆంక్షలు ఎత్తివేయాలని కోరింది. అంతేకాదు స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. అయితే ఈ ప్రతిపాదనను ట్రంప్ ఇప్పటివరకు తిరస్కరించారు. తాజా దౌత్య ప్రయత్నాలతో ఇరాన్ యుద్ధానికి ముగింపు లభిస్తుందా లేదా.. అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి: ఫోస్టర్ పిల్లల కోసం మెలానియా ట్రంప్ భారీ స్కాలర్‌షిప్‌లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement