చైనా సరిహద్దుల్లో వాయుసేన పాగా!  | Indian Air Force has successfully landed an transport aircraft at Nyoma Airbase | Sakshi
Sakshi News home page

చైనా సరిహద్దుల్లో వాయుసేన పాగా! 

Nov 8 2026 4:45 AM | Updated on Nov 8 2026 4:45 AM

Indian Air Force has successfully landed an transport aircraft at Nyoma Airbase

విజయవంతంగా రవాణా విమానం ల్యాండింగ్‌ 

13,629 అడుగుల ఎత్తైన న్యోమా క్షేత్రంలో రికార్డు

న్యూఢిల్లీ: భారతీయ వాయుసేన అరుదైన ఘనతను సాధించింది. సరిహద్దుల్లో తరచూ కవ్వింపులకు దిగుతున్న చైనాకు చెక్‌ పెట్టింది. లడాఖ్‌ తూర్పు ప్రాంతంలో వాస్తవాదీన రేఖకు కేవలం 25 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న న్యోమా వైమానిక క్షేత్రంలో సరుకు రవాణా విమానాన్ని ల్యాండ్‌ చేసింది. రష్యా తయారు చేసిన ల్యూషిన్‌ ఐల్‌–76 ఎండీ’సరుకుల రవాణా విమానం ఒకటి ఇంత ఎత్తైన (సముద్ర మట్టానికి 13,629 అడుగులు) ప్రదేశంలో దిగడం ఇదే మొదటిసారి అని వైమానిక దళం ప్రకటించింది. 

విమానం సామర్థ్యానికి, సిబ్బంది అత్యద్భుత నైపుణ్యాలు, కచ్చితత్వానికి ఇది నిదర్శమని తెలిపింది. న్యోమా కేంద్రంలో ఐఎల్‌–76ఎండీ ల్యాండింగ్‌ వ్యూహాత్మకంగానూ కీలకమైన విషయమని తెలిపింది. న్యోమా వైమానిక కేంద్రం సరిగ్గా ఏడాది క్రితమే అందుబాటులోకి వచ్చిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హమైన అంశం. తాజా ఫీట్‌తో ఈ కేంద్రం యుద్ధ విమానాలు, హెలికాప్టర్లతోపాటు రవాణా విమానాల కోసం కూడా ఉపయోగించుకోవచ్చని స్పష్టం అవుతోంది.

 ప్రస్తుతం లదాఖ్‌లో ఇదే రకమైన సామర్థ్యమున్న వైమానిక కేంద్రాలు నాలుగు ఉన్నాయి. లేహ్, కార్గిల్, థోయిసీలు మిగిలిన మూడు కేంద్రాలు. కార్గిల్‌ కేంద్రం సముద్రమట్టానికి దాదాపు 10,500 అడుగుల ఎత్తులో ఉంది. ఇటీవలి కాలంలో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ వాస్తవాదీన రేఖ వెంబడి ఉన్న అన్ని వైమానిక కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను ఆధునీకరణకు గట్టి చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రక్షణ అవసరాల కోసం అత్యాధునిక ల్యాండింగ్‌ గ్రౌండ్స్‌నూ ఏర్పాటు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement