అమెరికా నిఘా కెమెరాకు చిక్కిన చైనా రహస్య అంతరిక్ష విమానం! | Secret Chinese space plane caught on US spy camera | Sakshi
Sakshi News home page

అమెరికా నిఘా కెమెరాకు చిక్కిన చైనా రహస్య అంతరిక్ష విమానం!

Nov 2 2026 8:10 PM | Updated on Nov 2 2026 8:18 PM

Secret Chinese space plane caught on US spy camera

చైనా రహస్య అంతరిక్ష విమానమైన ‘షెన్‌లాంగ్‌’కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన ఫొటో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఫొటోను అమెరికా రక్షణ నిఘా సంస్థ విడుదల చేసిన నివేదికలో పొందుపరిచారు. భూమికి సమీప కక్ష్యలో తిరుగుతున్న ఈ రోబోటిక్‌ అంతరిక్ష విమానం గత ఆరేళ్లుగా అంతరిక్షంలో పలు ప్రయోగాలు నిర్వహిస్తోంది. గుర్తుతెలియని వస్తువులను అంతరిక్షంలో విడుదల చేయడంతో ఇది గతంలోనే పలుమార్లు వార్తల్లో నిలిచింది.

Space.com కథనం ప్రకారం.. 2024లో మాక్సర్‌ టెక్నాలజీస్‌ (ప్రస్తుతం వాంటర్‌) ఉపగ్రహం 90 కిలోమీటర్ల దూరం నుంచి ఈ చిత్రాన్ని తీసింది. ఒక్కో పిక్సెల్‌కు 4.5 సెంటీమీటర్ల రిజల్యూషన్‌తో విమానం పూర్తి వివరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరో ఉపగ్రహంతో అనుసంధానమై ఉన్న షెన్‌లాంగ్‌కు సోలార్‌ ప్యానెళ్లు విస్తరించి ఉండగా, వెనుకవైపు పేలోడ్‌ డోర్‌ తెరిచి ఉన్నట్లు ఫొటోలో వెల్లడైంది.

అమెరికాకు చెందిన బోయింగ్‌ X-37B తరహాలో షెన్‌లాంగ్‌ కూడా పునర్వినియోగ అంతరిక్ష విమానం. రాకెట్‌ ద్వారా కక్ష్యలోకి చేరుకుని, ప్రయోగాలు పూర్తయ్యాక విమానం తరహాలో భూమిపైకి తిరిగి వస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 7న లాంగ్‌ మార్చ్‌-2ఎఫ్‌ రాకెట్‌ ద్వారా చైనా జియుక్వాన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి నాలుగో ప్రయోగాన్ని ప్రారంభించింది.

ఈ విమానం పొడవు సుమారు 26 అడుగులని వాంటర్‌ వెల్లడించింది. నవంబర్‌ 3న డెన్వర్‌, నవంబర్‌ 5, 6 తేదీల్లో లాస్‌ ఏంజెల్స్‌ నగరాల మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని Space.com తెలిపింది. అంతేకాదు తెల్లవారుజామున ఆకాశంలో దీనిని కంటితో చూసే అవకాశం కూడా ఉంటుందని పేర్కొంది.

ఇదీ చదవండి: అమెరికా ఓకే అంటే హార్ముజ్ తెరుస్తాం.. ఇరాన్ సంచలన ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement