శ్వేతసౌధంలో దీపావళి వేడుకలు | Donald Trump celebrates Diwali at White House with Indian-Americans | Sakshi
Sakshi News home page

శ్వేతసౌధంలో దీపావళి వేడుకలు

Nov 8 2026 4:27 AM | Updated on Nov 8 2026 4:27 AM

Donald Trump celebrates Diwali at White House with Indian-Americans

ట్రంప్‌ చేతుల మీదుగా దీప ప్రజ్వలన 

పారిశ్రామికవేత్తలు, సీఈవోలు హాజరు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శ్వేతసౌధంలోని ఓవల్‌ కార్యాలయంలో దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం జరిగిన ఈ వేడుకలకు భారతీయ–అమెరికన్‌ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్‌ రంగ నేతలు హాజరయ్యారు. ఓవల్‌ ఆఫీసులో ట్రంప్‌ దీపం వెలిగించి దీపావళి వేడుకలను ప్రారంభించారు. ఆ తరువాత భారతీయ సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. 

అమెరికా అధ్యక్ష భవనంలో దీపావళి వేడుకల సంప్రదాయాన్ని 2003లో అప్పటి అధ్యక్షుడు జార్జ్‌ డబ్ల్యూ.బుష్‌ మొదలుపెట్టారు. అప్పట్లో వేడుకలు ఐసెన్‌హోవర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీస్‌ భవనంలో ఎక్కువగా జరిగేవి. 2009లో బరాక్‌ ఒబామా శ్వేతసౌధంలో దీపం వెలిగించి దీపావళి వేడుకలను జరిపిన తొలి అమెరికా అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించారు. అప్పటి నుంచి ఓవల్‌ కార్యాలయం, రూజ్‌వెల్ట్‌ గదుల్లో దీపావళి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది.

 ఈ ఏటి వేడుకల్లో భారత రాయబారి వినయ్‌ మోహన్‌ క్వాత్రా, ప్రముఖ చెఫ్‌ వికాస్‌ ఖన్నా, వ్యాపారవేత్త విశాల్‌ గొండల్, సామాజిక భద్రతా విభాగం డిప్యూటీ కమిషనర్‌ అర్జున్‌ మోదీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో, సంజయ్‌ మెహ్రోత్రా (మైక్రాన్‌ టెక్నాలజీ), అరవింద్‌ కృష్ణ (ఐబీఎం సీఈవో), కాశ్‌ పటేల్‌ (ఎఫ్‌బీఐ డైరెక్టర్‌), జయ్‌ భట్టాచార్య (అమెరికా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌ డైరెక్టర్‌) తదితరులు పాల్గొన్నారు. 

భారత్‌లో వీడియో గేమింగ్‌ రంగానికి ఆద్యుడిగా భావించే విశాల్‌ గోండల్‌ సామాజిక మాధ్యమంలో ఒక పోస్టు చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు తులసీదాస్‌ విరచిత 
హనుమాన్‌ చాలీసా ప్రతిని బహూకరించిన ఫొటోలు షేర్‌ చేశారు. ‘‘ధైర్యం, భక్తి, శక్తికి ప్రతీకైన గ్రంథాన్ని అధ్యక్షుడికి అందించడం గర్వంగా ఉంది’’అని వ్యాఖ్యానించారు. 

ట్రంప్‌ దీప ప్రజ్వలన చేసే సమయంలో భారత్‌–అమెరికా స్నేహబంధం మరింత బలోపేతం కావాలని, చెడుపై మంచి విజయం సాధించాలని ప్రారి్థంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో రూబీ ధల్లా, రాజీవ్‌ శర్మ, విశ్వజిత్‌ మల్లంపాటి, కేశవం డీసీ, హేతల్‌కుమార్‌ పటేల్, శ్వేతసౌధ ఈవెంట్స్‌ అషర్‌ అరవింద్‌ చద్దా తదితరులు కూడా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement