ఇరాన్‌పై మళ్లీ అమెరికా దాడులు | US launched minor strikes on Iran targeting a little bit of an anti-aircraft device | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై మళ్లీ అమెరికా దాడులు

Nov 8 2026 4:21 AM | Updated on Nov 8 2026 4:21 AM

US launched minor strikes on Iran targeting a little bit of an anti-aircraft device

ఇరాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నాం 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటన  

వాషింగ్టన్‌:  మధ్యంతర ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీ ఇరాన్‌ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దూకుడు తగ్గడం లేదు. ఇరాన్‌పై పరిమిత దాడులు చేసినట్లు ట్రంప్‌ ప్రకటించారు. ఇరాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నట్లు చెప్పారు. ఆయన శుక్రవారం ఫ్లోరిడాలోని వెస్ట్‌ పామ్‌ బీచ్‌లో మీడియాతో మాట్లాడారు. ఇరాన్‌పై తాజా సైనిక చర్యను ‘స్వల్పమైనది’గా అభివర్ణించారు. 

వారు(ఇరాన్‌) ఒక చిన్న విమాన విధ్వంసక పరికరాన్ని ఏర్పాటు చేయగా, తాము దానిని ఐదు నిమిషాల్లోనే ధ్వంసం చేశామని తెలిపారు. ఇరాన్‌పై దాడికి సంబంధించి ట్రంప్‌ పూర్తి వివరాలు వెల్లడించలేదు. అయితే, చమురు రవాణా కు కీలకమైన జలమార్గంలో ఉన్న ఖేష్మ్‌ ద్వీపంలోని సుజా ప్రాంతంలో రెండు పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్‌ ప్రభుత్వ మీడియా పేర్కొంది. మంగళవారం జరిగిన మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ పార్టీ ఓటమి తర్వాత ఇరాన్‌పై దాడులు జరగడం ఇదే మొదటిసారి. ఈ ఎన్నికల్లో ఓటమిని ట్రంప్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేశారు. 

ఇరాన్‌ను సర్వనాశనం చేస్తామని తొలుత హెచ్చరించారు. యుద్ధానికి పరిష్కారం చాలా దగ్గర్లోనే ఉందని తర్వాత చెప్పారు.  ఇరాన్‌ అణు కార్యక్రమం, అక్కడి సౌకర్యాలు, పరికరాలు, శాస్త్రవేత్తల గురించి తమకు సమాచారం అందించిన వారికి 20 మిలియన్‌ డాలర్ల వరకు బహుమతి అందజేస్తామని పశి్చమాసియాలో అమెరికా సైనిక కార్యకలాపాలను పర్యవేక్షించే యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ ఈ మేరకు శుక్రవారం రాత్రి ‘ఎక్స్‌’లో పోస్టుచేసింది. ఆ పోస్టులో అమెరికా విదేశాంగ శాఖ ‘రివార్డ్స్‌ ఫర్‌ జస్టిస్‌’కార్యక్రమానికి సంబంధించిన లింక్‌ కూడా ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement