బాధ్యతాయుత సంబరం.. గ్రీన్‌ క్రాకర్స్‌ మంత్రం! | How to identify genuine Green crackers in the market | Sakshi
Sakshi News home page

బాధ్యతాయుత సంబరం.. గ్రీన్‌ క్రాకర్స్‌ మంత్రం!

Nov 8 2026 3:38 AM | Updated on Nov 8 2026 3:38 AM

How to identify genuine Green crackers in the market

మార్కెట్‌లో అసలైన హరిత బాణసంచాను గుర్తించడమెలా?

వీటితో శబ్ద, వాయు కాలుష్యం తగ్గుదల

పరిమితంగా కాల్చుదాం.. పండుగను ఆస్వాదిద్దాం

సాక్షి, స్పెషల్‌ డెస్క్‌ :  దీపావళి పండుగ వేళ మతాబుల వెలుగులు, కాకరపువ్వొత్తుల కాంతులు అందరికీ ఆనందాన్నిస్తాయి. కానీ ఆ బాణాసంచా వెలుగుల వెనుక ఉన్న పొగ, రసాయన, శబ్ద, వాయు కాలుష్యాలు ప్రజల ఆరోగ్యానికి పెనుముప్పుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో పండుగ సంప్రదాయాన్ని బతికించుకుంటూనే కాలుష్యాన్ని తగ్గించేందుకు అందుబాటులోకి వచ్చినవే ‘గ్రీన్‌ క్రాకర్స్‌’(హరిత బాణసంచా). పేరులో ‘గ్రీన్‌’ ఉన్నంత మాత్రాన ఇవి పర్యావరణానికి పూర్తిగా మేలు చేస్తాయని, అసలు పొగ రాదని చాలామంది అపోహపడుతుంటారు. అందుకే అసలు వాస్తవాలేంటి? ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలేంటి? మార్కెట్లో అసలైన హరిత వెలుగులను గుర్తించడమెలా? తెలుసుకుందాం!

సాధారణ బాణసంచాకు, గ్రీన్‌ క్రాకర్స్‌కు తేడా ఏమిటి?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ‘కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫి­క్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌’ (సీఎస్‌ఐఆర్‌), ‘నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ (ఎన్‌ఈఈఆర్‌ఐ) సంయుక్తంగా ‘గ్రీన్‌ క్రాకర్స్‌’ ప్రమాణాలను 2018లో రూపొందించాయి.

రసాయనాల నియంత్రణ: సాధారణ బాణసంచా­లో వాడే బేరియం నైట్రేట్, ఆర్సెనిక్, సీసం, పాదరసం వంటి ప్రమాదకరమైన రసాయనా­లను ఇందులో తొలగించారు. వాటి స్థానంలో తక్కువ హానికరమైన ప్రత్యామ్నాయ రసాయనాలను ఉపయోగిస్తారు. 

తగ్గిన ఉద్గారాలు: సాధారణ బాణసంచాతో పోలిస్తేగ్రీన్‌ క్రాకర్స్‌ దాదాపు 30% నుంచి 35% తక్కువ ఉద్గారాలను, ధూళి కణాలను (పీఎం 2.5) విడుదల చేస్తాయి.

శబ్ద తీవ్రతకు కళ్లెం: సాధారణ బాణాసంచా 160 డెసిబెల్స్‌ వరకు శబ్దం చేస్తే హరిత బాణాసంచా శబ్ద తీవ్రత 110 నుంచి 125 డెసిబెల్స్‌ మాత్రమే ఉంటుంది.

దుమ్మును అణచివేసే ఆవిరి: గ్రీన్‌ క్రాకర్స్‌ పేల్చినప్పుడు వాటిలోని రసాయన చర్యల వల్ల నీటి ఆవిరి విడుదలవుతుంది. ఈ ఆవిరి గాలిలోని దుమ్ము కణాలను కిందకు అణిచి­వేయటంలో ఇది సహాయపడుతుంది.

ఒరిజినల్‌ గ్రీన్‌ క్రాకర్స్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్లో నకిలీ గ్రీన్‌ క్రాకర్స్‌ బెడద ఎక్కువగా ఉంది. కొనుగోలు చేసేటప్పుడు బాక్సులపై ఈ అంశాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలి. బాక్సుపై ‘సీఎస్‌ఐఆర్‌– ఎన్‌ఈఈఆర్‌ఐ’ అధికారిక లోగో ముద్రించి ఉండాలి. ప్రతి బాక్సుపై ఒక ప్రత్యేకమైన క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌తో స్కాన్‌ చేస్తే తయారీ వివరాలు కనిపిస్తాయి. వీటిని ప్రధానంగా సేఫ్‌ వాటర్‌ రిలీజర్‌ ( గిఅ ), సేఫ్‌ థర్మైట్‌ క్రాకర్‌ (  ఖీఅఖ), సేఫ్‌ మినిమల్‌ అల్యూమినియం ( అఊఅఔ) అనే పేర్లతో విక్రయిస్తారు. ముఖ్యంగా లైసెన్స్‌ పొందిన షాప్‌ల వద్దే అసలైన గ్రీన్‌ క్రాకర్స్‌ లభిస్తాయి. కాబట్టి అక్కడే కొనుగోలు చేయండి.

పరిమిత వాడకమే శ్రేయస్కరం!
‘గ్రీన్‌ క్రాకర్స్‌’ అంటే కాలుష్యం సున్నా అని కాదు.. కేవలం ‘తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తాయి. వీటి తయారీలోనూ స్వల్ప స్థాయిలో రసాయనాలు ఉంటాయి. పెద్ద ఎత్తున కాల్చితే గాలి నాణ్యత పడిపోవడం ఖాయం. పర్యావరణ పరిరక్షణ, శ్వాసకోశ సమస్యలతో బాధ పడేవారు, పసి పిల్లలు, మూగజీవాల రక్షణ దృష్ట్యా వీటిని కూడా పరిమితంగానే కాల్చి బాధ్యతాయుతంగా పండుగ జరుపుకోవడమే ప్రతి ఒక్కరి కర్తవ్యం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement