తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ దీపావళి శుభాకాంక్షలు | YSRCP Chief YS Jagan extends his warm Diwali greetings to Telugu people | Sakshi
Sakshi News home page

తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ దీపావళి శుభాకాంక్షలు

Nov 7 2026 7:38 PM | Updated on Nov 7 2026 7:51 PM

YSRCP Chief YS Jagan extends his warm Diwali greetings to Telugu people

తాడేపల్లి :  వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి అంటేనే ఉజ్వల కాంతి అని, చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం.. దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయమని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ దీపావళి అని, ఈ దీపావళి పండగ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని,  సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలనీ, ప్రజలందరి జీవితాలు శోభాయమానంగా వెలుగొందాలనీ, ప్రతి ఇంటా ఆనంద కాంతులు విరాజిల్లాలని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు.

ఇదీ చదవండి: మీరు చేసే నిర్బంధాలు దుర్మార్గం.. మీ పాలన హేయం: వైఎస్‌ జగన్‌

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement