మన దేశంలో దీపావళికి టపాసులు కాల్చడం సంప్రదాయం. అలాగే ప్రపంచంలో చాలా దేశాలలో ఆకాశాన్ని రంగురంగుల వెలుగులతో నింపేస్తూ భారీగా బాణసంచా కాల్చే పండగలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందామా పిల్లలూ.
చైనా
టపాసుల పుట్టినిల్లు చైనా. ప్రతి ఏటా జనవరి లేదా ఫిబ్రవరిలో వచ్చే చైనీస్ నూతన సంవత్సరం రోజున అక్కడ ప్రపంచంలోనే అత్యంత భారీగా టపాసులు కాలుస్తారు. చెడు శక్తులను తరిమికొట్టేందుకు, అదృష్టాన్ని ఆహ్వానించేందుకు అక్కడ ఈ వేడుక చేస్తారు.
జూన్
జూన్‌లో జూలై, ఆగస్టు నెలల్లో ‘హనాబి’ (అంటే నిప్పు పువ్వులు) పేరుతో పెద్ద బాణసంచా పండుగలు జరుగుతాయి. ఇవి కేవలం వేడుకలు మాత్రమే కాదు అక్కడ పెద్ద పెద్ద పోటీలు కూడా నిర్వహిస్తారు. నదీ తీరాల్లో లక్షలాది మంది కూర్చుని ఈ వెలుగుల ప్రదర్శనను చూస్తారు.
ఆస్ట్రేలియా
కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే వేడుకల్లో సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ దగ్గర జరిగే బాణసంచా ప్రదర్శన ప్రపంచ ప్రసిద్ధి చెందింది. డిసెంబర్ 31 అర్థరాత్రి వేల కిలోల టపాసులను కాల్చి సరికొత్త రంగులతో ఆకాశాన్ని ముంచెత్తుతారు.
అమెరికా
అమెరికాకు స్వాతంత్య్రం వచ్చిన జూలై 4న ఆ దేశంలో టపాసుల పండుగ వాతావరణం కనిపిస్తుంది. ప్రతి చిన్న టౌన్ నుండి వాషింగ్టన్ డీసీ నగరం వరకు రాత్రిపూట ఆకాశంలో గంటల తరబడి అద్భుతమైన బాణసంచా ప్రదర్శనలు జరుగుతాయి.
ఇదీ చదవండి: భూమి ‘దీపావళి పండుగ’..అచ్చం బాణసంచా మాదిరి..!: శుభాంషు శుక్లా


