నయా ట్రెండ్‌: ఇష్టంగా కస్టమైజ్డ్‌..! | Customization vs Personalization in the User Experience | Sakshi
Sakshi News home page

నయా ట్రెండ్‌: ఇష్టంగా కస్టమైజ్డ్‌..!

Nov 7 2026 9:08 AM | Updated on Nov 7 2026 9:08 AM

Customization vs Personalization in the User Experience

ఒకప్పుడు షాప్‌లో ఏది బాగుంటే అదే కొనడం అలవాటు.. ఆ తరువాత ‘బ్రాండ్‌’.. ఒక క్రేజీగా మారింది. ఆ లోగో మన వస్తువులపై ఉంటే అదే ఆనందం. అదే లగ్జరీకి సింబల్‌. మరి ఇప్పుడు సాంకేతికత పెరిగింది. అంతా డిజిటల్‌ మయం. అందుకే వినియోగదారుల ఆలోచనల్లోనూ మార్పు వచ్చింది. ఏదయినా ‘నాకు నచ్చినట్టు.. నేను చెప్పినట్టు ఉంటేనే కొంటాను’ అనే పద్ధతి పాపులర్‌ అయిపోయింది. ఈ నయా ట్రెండ్‌కి పెట్టిన పేరే కస్టమైజేషన్‌ లేదా పర్సనలైజేషన్‌. 

మనం నిత్యం వాడే వస్తువుల్లో మన వ్యక్తిత్వం కనిపించాలని ఇప్పటి తరం కోరుకుంటోంది. ఒక బ్రాండెడ్‌ ప్రొడక్ట్‌ను కొని వాడుకోవడానికి, దానికి మన ఇష్టాయిష్టాలను జోడించడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అందుకే ఇప్పుడు ‘పర్సనలైజ్డ్‌ ప్రొక్ట్స్‌’ మార్కెట్‌ను ఊపేస్తున్నాయి.

ఒకప్పుడు బ్యాగ్‌పై లేదా కీచైన్‌పై పేరు రాయించుకోవడమే గొప్ప కస్టమైజేషన్‌. కానీ నేటి ట్రెండ్‌ దానికి ఎన్నో రెట్లు ముందుకు వెళ్ళింది. వేలిముద్రలతో కూడిన డ్యూయల్‌ రింగ్స్, పుట్టిన నెలను బట్టి ఎంచుకునే బర్త్‌స్టోన్స్‌, ల్యాప్‌టాప్‌ స్లీవ్‌లు, ఫోన్‌ కేస్‌లపై నచ్చిన సినిమా డైలాగులు, ఇష్టమైన పాటలోని లిరిక్స్, నవ్వించే కార్టూన్స్, ఇష్టమైన కలర్‌ స్నీకర్లు, టీ–షర్టులు ఇలా ఒక్కటేమిటి ఉదయం లేచిన నుంచి ఉపయోగించే టూత్‌ బ్రష్‌తో మొదలై రాత్రి నిద్రపోయే ముందు వరకి ఉపయోగించే బెడ్‌ ల్యాంప్‌ వరకు అన్నింట్లోనూ పర్సనలైజేషన్‌ చేరింది. 

కానుకల్లోనూ కస్టమైజ్డ్‌ మార్క్‌!
ఒక బహుమతి విలువ దాని ధరలో ఉండదు, దాని వెనుకున్న ఆలోచనలో ఉంటుంది. దీనినే ఇప్పుడు మార్కెట్‌ బిజినెస్‌ స్ట్రాటజీగా మలుచుకుంది. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పండుగలు, ప్రేమికుల దినోత్సవం వంటి కార్యక్రమాల్లో సైతం ఆన్‌లైన్‌ వేదికల ద్వారా ఆర్డర్లు తీసుకుంటోంది. కస్టమర్ల అభిరుచిని అర్థం చేసుకుంటూ.. ఇచ్చేవారి.. పుచ్చుకునేవారి మనసును దోచుకునేలా రూపొందిస్తున్నాయి. 

ఈ ట్రెండ్‌ని కేవలం వ్యక్తగత వినియోగదారులే కాదు .. పెద్ద పెద్ద కంపెనీలు కూడా తమ బ్రాండింగ్‌ కోసం ఎంచుకుంటున్నాయి. తమ ఉత్పత్తులపై కేవలం ఆయా లోగోలు వేయడమే కాకుండా.. ఒక మంచి సందేశాన్ని కూడా అందిస్తున్నాయి. ఇది కస్టమర్లకు, కంపెనీకి మధ్య ఒక ఎమోషనల్‌ బాండింగ్‌కి తోడ్పడుతోంది. 

సవాళ్లూ లేకపోలేదు!
అయితే ఈ కస్టమైజ్డ్‌ బిజినెస్‌ లాభదాయకమే అయినప్పటికీ.. కొన్ని సవాళ్లూ దాగున్నాయి. ప్రతి ఆర్డర్‌ను ప్రత్యేకంగా తయారు చేయాల్సి రావడం, ప్రింటింగ్‌ మిస్టేక్స్, రిటర్న్‌ ప్రాసెస్, ప్యాకేజింగ్, ట్రాన్స్‌పోర్ట్‌ ఖర్చులు వంటి ఇబ్బందులూ ఉన్నాయి. ఒక్కోసారి లాభంపై కూడా ప్రభావం చూపవచ్చు. అందువల్ల సరైన ధరలను నిర్ణయించడం, నిర్ణీత సమయానికి డెలివరీ చేయడం, ప్రొడక్ట్‌ నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించడం కూడా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. 

మొత్తంగా చూస్తే.. ‘అందరికీ ఒకటే’ అనే ఆలోచన నుంచి ‘నాకోసం ప్రత్యేకం’ అనే అభిరుచివైపుగా వినియోగదారుల ఎంపిక మారుతోంది. సాధారణ వస్తువుకు తన అభిరుచుల్ని జోడించి ఆ వస్తువు విలువను మాత్రమే కాదు.. దానితో ముడిపడిన అనుభూతిని కూడా ప్రత్యేకంగా మార్చుకోవచ్చని ఈ ట్రెండ్‌ చెబుతోంది.

ఇదీ చదవండి: దీపావళి సందేశం..పిల్లలకు నేర్పింద్దాం ఇలా..!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement