యువత దారికి అడ్డు రావొద్దు  | Dont come in the way of protesting students: Rahul Gandhi to PM Modi | Sakshi
Sakshi News home page

యువత దారికి అడ్డు రావొద్దు 

Oct 15 2026 5:43 AM | Updated on Oct 15 2026 5:42 AM

Dont come in the way of protesting students: Rahul Gandhi to PM Modi

ప్రధాని మోదీకి రాహుల్‌ గాంధీ హితవు  

పోలీసుల దాడిలో గాయపడిన విద్యార్థులకు పరామర్శ  

అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా  

బాధ్యులు శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరిక  

తీవ్రంగా గాయపడ్డామని విద్యార్థుల ఆవేదన  

న్యూఢిల్లీ:  నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు ఈ దేశం గొంతుక అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. యువత దారికి అడ్డు రావొద్దని ప్రధాని నరేంద్ర మోదీకి సూచించారు. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా ఇటీవల జరిగిన నిరసనల సందర్భంగా గాయపడిన కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూకి చెందిన విద్యార్థులను రాహుల్‌ బుధవారం కలిశారు. ఢిల్లీ 10, జనపథ్‌లోని సోనియా గాంధీ నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. నిరసనల సమయంలో విద్యార్థుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. 

పోలీసుల అమానుష ప్రవర్తన గురించి, తమపై దాడి చేయడం గురించి రాహుల్‌కు విద్యార్థులు వివరించారు. పోలీసులు తమను దారణంగా దూషించడమే కాకుండా, తమ జననేంద్రియాలపై కూడా కొట్టడం వల్ల తీవ్రంగా గాయపడ్డామని చెప్పారు. విద్యార్థుల ఆవేదన విని రాహుల్‌ గాంధీ చలించిపోయారు. ఎవరూ అందోళన చెందవద్దని, పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విద్యార్థులను సింహాలు, ఆడసింహాలుగా అభివరి్ణంచారు. ఒక విద్యార్థినిని ‘మన షేర్ని’గా పరిచయం చేశారు. ‘‘ఆమెపై దాడి జరిగింది కానీ ఆమె భయపడలేదు. ఆమె హృదయంలో ఎలాంటి ద్వేషం లేదు’’అని అన్నారు.  

దాడి చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు  
నరేంద్ర మోదీ, అమిత్‌ షాలు ప్రజల గొంతుకకు, వారి నిరసనకు ఎదురుగా నిలబడి ఉన్నారని రాహుల్‌ ఆక్షేపించారు. ప్రజలకు ఇంకా ఎదురుగా నిలబడవద్దని, అలా చేస్తే మీరు తట్టుకోలేరు అని మోదీ, అమిత్‌ షాలకు సూచించారు. ఈ దేశంలో కులం, మతం, లింగభేదాలు లేకుండా ప్రజలంతా ఒక్కటిగా కలిసి ఉన్నారని, వారిని ఎవరూ విడగొట్టలేరని చెప్పారు. పోలీసుల దాడిలో గాయపడిన విద్యార్థులంతా భుజం భుజం కలిపి నిలబడాలని రాహుల్‌ సూచించారు. 

ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకుంటున్న ఓ విద్యార్థిని పోలీసుల దాడిలో వినికిడి శక్తి కోల్పోయిందని ఆరోపించారు. ఆమెకు జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. తమ విద్యార్థులపై దాడి చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నరేంద్ర మోదీ, అమిత్‌ షా, జ్ఞానేశ్‌ కుమార్‌ సహా తమ పిల్లలపై చేయి చేసుకున్న కానిస్టేబుళ్ల వరకు అందరినీ శిక్షిస్తామని ఉద్ఘాటించారు. రాహుల్‌ గాం«దీతో మాట్లాడుతున్నప్పుడు ఓ విద్యార్థి మహాత్మా గాం«దీకి ఇష్టమైన ‘వైష్ణవ జనతో’అనే భజన గీతాన్ని వేణువుపై వాయించారు. ద్వేషానికి సమాధానం ప్రేమతోనే ఇస్తామని అన్నారు.  

వీడియోలు, ఫొటోలు భద్రపర్చుకోండి  
గాయపడిన విద్యార్థులతో భేటీ అనంతరం రాహుల్‌ గాంధీ ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. ‘‘మన ప్రజాస్వామ్య స్వరాన్ని అణచివేయాలని చూసేవారు చట్టం ఆగ్రహానికి గురయ్యే రోజు వస్తుంది. తప్పు చేసినవారు ఎవరైనా సరే శిక్ష అనుభవించక తప్పదు. పోలీసుల క్రూరత్వానికి, చట్టవిరుద్ధమైన నిర్బంధానికి గురైన విద్యార్థులు, యువతీ యువకులు దానికి సంబంధించిన వీడియో లు, ఫోటోలు భద్రపర్చుకోవాలి. అది చాలా అవసరం. బాధ్యులను శిక్షించడానికి అవి ఉపయోగపడతాయి. శాంతియుత నిరసన మీ హక్కు. దానిని ఎవరైనా లాక్కోవాలని చూస్తే సహించం’’ అని స్పష్టం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement