breaking news
NSUI activists
-
బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ
-
‘రాజ్’కున్న ముట్టడి
సాక్షి, హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్, సోనియాలపై ఈడీ వేధింపులను నిరసిస్తూ, ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులపై పోలీసులు దాడి చేయడాన్ని ఖండిస్తూ గురువారం రాష్ట్ర కాంగ్రెస్ చేపట్టిన ‘రాజ్‌భవన్ ముట్టడి’ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాజ్‌భవన్ వైపునకు వెళ్లకుండా పోలీసులు నాలుగంచెల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. వచ్చినవారిని వచ్చినట్టుగా అదుపు లోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తీవ్ర వాగ్వాదాలు, తోపులాట, లాఠీచార్జి, అరెస్టులు తదితర ఘటనలతో హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ చౌరస్తా అట్టుడికి పోయిం ది. ఉదయం 5:30 నుంచి ప్రారంభమైన ఈ ముట్టడి కార్యక్రమం మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగడం తో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. చివరకు పోలీసులు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలందరినీ అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్స్టేషన్లకు తరలించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. తెల్లవారుజాము నుంచే టీపీసీసీ పిలుపు నేపథ్యంలో గురువారం తెల్లవారు జామునే ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు పోలీసుల కళ్లుగప్పి రాజ్‌భవన్ వద్దకు చేరుకుని గేటు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సమయంలో తక్కువ సంఖ్యలో ఉన్న పోలీసులు అతి కష్టం మీద వీరందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత టీపీసీసీ మత్స్య కారుల కమిటీ చైర్మన్ మెట్టుసాయికుమార్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుల నేతృత్వంలో కార్యకర్తలు 3 దఫాలుగా రాజ్‌భవన్ వద్దకు చేరుకోగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శివసేనారెడ్డిని అదుపులోకి తీసుకునే సమయంలో ఆయన కాలు పోలీస్ వాహనం డోర్లో ఇరుక్కుపోయింది. దీంతో మరో కాలుతో ఆయన ఆ డోర్ అద్దాలను పగులగొట్టడంతో ఆయనతో పాటు ఒకరిద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. ఖైరతాబాద్ చౌరస్తాలో గురువారం కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన.. నిలిచిపోయిన ట్రాఫిక్ జగ్గారెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డిలకు గాయాలు ఉదయం 10:45 సమయంలో రేవంత్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, ఏఐసీసీ కార్య క్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, గీతారెడ్డి, అంజన్‌కుమార్‌యాదవ్ తదితరులు ఖైరతాబాద్ చౌరస్తాకు చేరుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో వారు అక్కడే బైఠాయించారు. అదే సమయంలో ఆవేశా నికి లోనైన యూత్‌కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు అక్కడ ఉన్న ఓ బైక్‌కు నిప్పు పెట్టారు. కాచిగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ గందరగో ళంలో రేవంత్ బృందం నాలుగో అంచె బారికేడ్ల వరకు చేరుకున్నారు. అయితే అక్కడ ముళ్లకంచెలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో పోలీసులు వారిని నిలువరించగలి గారు. భట్టి, రేవంత్‌రెడ్డితో పాటు ఇతర నేతలు కార్యకర్త లను అదుపులోకి తీసుకుని.. పోలీసు వాహనంలో తర లిస్తుండగా కార్యకర్తలు అడ్డుకోవడంతో పోలీసులు లాఠీ చార్జి చేశారు. టీపీసీసీ నేత చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని ఐదుగురు పోలీసులు చుట్టుముట్టి లాఠీచార్జి చేయడంతో గాయాలయ్యాయి. ఆయన్ను చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇక సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా కొందరు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి పోలీసులను తప్పించుకుని దాదాపు రాజ్‌భవన్ వరకు వెళ్లారు. అక్కడ బారికేడ్లను దాటే క్రమంలో ఆయన మోకాలికి గాయమైంది. జగ్గారెడ్డి తదితరులను కూడా పోలీసులు అక్కడినుంచి తరలించారు. మాజీ ఎంపీలు వి.హనుమం తరావు, మల్లురవి, బోసురాజు, శ్రీనివాసకృష్ణన్, ఆది శ్రీనివాస్, కె.మదన్మోహన్రావు తదితరులను కూడా పోలీసులు రాజ్‌భవన్ వైపునకు వెళ్లకుండా అడ్డుకుని వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. రేణుక రాకతో మరోమారు ఉద్రిక్తత మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కొందరు మహిళా నేతలతో కలిసి కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి రావడంతో మరోమారు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రాజ్‌భవన్ వైపునకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మహిళా పోలీసులకు, రేణుకకు మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో అక్కడే ఉన్న ఓ పోలీసు అధికారి చేయి తగలడంతో.. ఒక్కసారిగా ఆవేశానికి లోనైన ఆమె ఆయన కాలర్ పట్టుకుంది.. దీంతో వాతావరణం వేడెక్కింది. పోలీసులు అతికష్టం మీద ఆమెను అదుపులోకి తీసుకోగలిగారు. ఎస్సై కాలర్ పట్టుకున్న రేణుకపై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తన చుట్టూ పురుష పోలీసులు ఉండడంతో దురదృష్టకరమైన ఘటన జరిగింది తప్ప తాను కావాలని చేయలేదని రేణుక వివరణ ఇచ్చారు. పోలీసులు తనను వెనకవైపు నుంచి నెట్టేయడం, గిల్లడం లాంటివి చేశారని, తనపైకి దూసుకు వస్తున్న ఎస్సైని రావొద్దంటూ చేయి పెట్టి అడ్డుకున్నానని, కాలర్ పట్టుకోలేదని వివరించారు. వాస్తవానికి గురువారం ఉదయం గవర్నర్ తమిళిసై నగరంలో లేరు. మధ్యాహ్నం పుదుచ్చేరి నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న ఆమె కాంగ్రెస్ పార్టీ ఆందోళన కొనసా గుతున్న సమయంలోనే రాజ్‌భవన్‌లోనికి వెళ్లారు. -
సీశాట్ వ్యతిరేకోద్యమం ఉధృతం
సీశాట్ వ్యతిరేక జ్వాలలు రగులుతున్నాయి. విద్యార్థులు, విద్యార్థి సంఘాలు దాదాపు నెల రోజుల నుంచి ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు, ర్యాలీలను నిర్వహిస్తూనే ఉన్నారు. శనివారం నాటి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వారిపై పోలీసులు లాఠీ ఝళిపించడంతో వందలాదిమంది గాయపడ్డారు. న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)లో సీశాట్ విధానానికి వ్యతిరేకంగా ఎన్ఎస్యూఐ కార్యకర్తలు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ నివాసం వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇదే అంశంపై గత బుధవారం ఉత్తర ఢిల్లీలోని నెహ్రూ విహార్ ప్రాంతంలో ఆందోళనకు దిగినవారిపై పోలీసుల దుందుడుకుతనానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినదించారు. ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎన్ఎస్యూఐ ప్రధాన కార్యదర్శి మోహిత్ శర్మ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా యూపీఎస్సీతోపాటు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికివ్యతిరేకంగా నినదించారు. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీలకు పనిచెప్పడంతో వందలాదిమంది గాయపడ్డారు. కొంతమంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై ఎన్ఎస్యూఐ అధికార ప్రతినిధి అమ్రిష్ రంజన్ పాండే మీడియాతో మాట్లాడుతూ అదుపులోకి తీసుకున్నవారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అమాయకులైన ఆందోళనకారులపై పోలీసుల బలప్రయోగాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. గత 25 రోజులుగా సీశాట్ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఎంతమాత్రం స్పందించడం లేదన్నారు. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సీశాట్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఎన్ఎస్యూఐ కార్యకర్తలు తొలుత భారీ సంఖ్యలో రాజ్‌నాథ్ నివాసానికి రావడాన్ని గమనించిన పోలీసులు ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా అక్కడ బ్యారికేడ్లను ఏర్పాటుచేశారు. కొంతమంది ఆందోళనకారులను పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇదిలాఉంచితే యూపీఎస్సీ పరీక్షలో భాగంగా విద్యార్థులు సీశాట్ 1, సీ-శాట్ 2 అనే రెండు ప్రాథమిక పరీక్షలను రాయాల్సి ఉంటుంది. సీశాట్‌లో స్కిల్స్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. దీంతోపాటు ఎనలిటికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్, ప్రాబ్లం సాల్వింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ , బేసిక్ న్యూమరసీ, ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రిహెన్సివ్ స్కిల్స్తదితరాలు కూడా ఇందులో ఉంటాయి. ఈ పరీక్షను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహిస్తుంది. ఇందులో ఉత్తీర్ణులైన ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్ పొందుతారు. సరైన సమయంలో నిర్ణయం: కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)లో సీశాట్ (సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్) విధానానికి తమ ప్రభుత్వం సరైన సమయంలో ఓ నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ స్పష్టంచేశారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ వివాదానికి సంబంధించి సరైన సమయంలో మా నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. అంతవరకూ విద్యార్థులు ప్రశాంతంగా ఉండాలని కోరారు. అంతకుముందు ఆయన ఈ అంశంపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశమై కొద్దిసేపు చర్చించారు. ఇదే అంశంపై బీజేపీ నాయకుడు జేపీ నడ్డా మాట్లాడుతూ దీన్ని ఓ కొలిక్కి తీసుకొచ్చే ఆలోచనలో నరేంద్రమోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉందన్నారు. -
రాజ్‌నాథ్ నివాసాన్ని ముట్తడించిన NSUI కార్యకర్తలు