అదే దీపావళి వెలుగు..! | Diwali 2026: Actress Archanas Diwali Chat | Sakshi
Sakshi News home page

అదే దీపావళి వెలుగు..!: నటి అర్చన

Nov 7 2026 7:34 AM | Updated on Nov 7 2026 7:34 AM

Diwali 2026: Actress Archanas Diwali Chat

‘మా అమ్మ తెలుగు. మా నాన్న తమిళం. నాకు పదకొండు నెలల వయసున్నప్పుడు మేము మద్రాసు వెళ్లి΄ోయాం. ఇక నేను చదువుకుంది బతికింది అంతా మద్రాసులోనే. తమిళులకు దీపావళి ముఖ్యమైన పండగ. మనకు సంక్రాంతిని తమిళనాడులో పొంగల్‌గా చేసుకుంటారు దాని ఆకర్షణ వేరు దీపావళి ఉత్సాహం వేరు. దీపావళి వెలుగు కోసం అందరం ఎదురు చూస్తాం. నేను దీపావళి కోసమే తమిళంలో ఇప్పుడు చేస్తున్న షూటింగ్‌ని గబగబా ముగించుకుని ఇప్పుడు హైదరాబాద్‌లో షూటింగ్‌ చేస్తున్నాను. దీపావళి ఉందని ఎలాగైనా సరే ఇవాళ షూట్‌ ముగించమని ప్రొడక్షన్‌ వాళ్లకు చెప్పాను. దీపావళిని మిస్‌ కావడం నాకు ఇష్టముండదు. 

లైఫ్‌లో చీకటి వెలుతురులు తెలియడం ముఖ్యం. ఇవాళ్టి తరం ఎంత సేపూ ఫోన్‌లో మునిగి ఫోన్‌కు అడిక్ట్‌ అవుతున్నారు. వారు కృత్రిమమైన వెలుతురుకు అలవాటు పడ్డారు. కాస్త చీకటిని కూడా సహించలేక΄ోతున్నారు. దాని గురించి ఆలోచించాలి. విమెన్‌ చాలా ఎంపవర్‌ అయ్యారు. నాకు అన్నీ సమర్థంగా చేసే స్త్రీలను చూస్తే చాలా ఇష్టం. మనకు దొరికిన స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను మన సమర్థత తెలియచేయడానికి ఉపయోగించడమే విమెన్‌ ఎంపవర్‌మెంట్‌గా భావిస్తాను 

నేను. మన లోపలి వెలుతురు బయటకు రావాలి. నీలోని వెలుగును బయటకు తేవడమే దీపావళి. నేటి స్త్రీలు, జెన్‌ జి అమ్మాయిలు ఎంత ముందుకు దూసుకుపోతే అంత ఆనందిస్తాను. కాని ఆ ముందంజ మనల్ని గెలిపించి మన బాధ్యతను ఓడించకూడదు. చీకటిని ఓడించడానికి దివ్వె వెలిగించడం స్త్రీలకు తెలుసు. వారు గెలుస్తూ ఉండటమే దీపావళి’. 

ఇదీ చదవండి: వైవాహిక బంధం కోసం.. 15 రోజుల కోర్సు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement