పెళ్లి కోసం..15 రోజుల కోర్సు! | Goa college rolls out 15-day course for long-lasting marriages | Sakshi
Sakshi News home page

వైవాహిక బంధం కోసం.. 15 రోజుల కోర్సు..!

Nov 6 2026 6:28 PM | Updated on Nov 6 2026 6:38 PM

Goa college rolls out 15-day course for long-lasting marriages

వృత్తి కోసం సన్నద్ధమవ్వడం చూశాం. అందుకోసం ఎలా ఇంటర్వ్యూలు ఫేస్‌ చేయాలి..వచ్చిన ఉద్యోగాన్ని ఎలా నిలబెట్టుకుని..ఉన్నత స్థాయికి వెళ్లాలో ట్రైన్‌​ అవ్వడం చూశాం. అలాగే ఉపాధి కోర్సులు, పలు ఇంటర్న్‌షిప్‌లు గురించి విన్నాం. కానీ ఇదేంటి పెళ్లి కోసం కూడా కోర్సులా..?. మ్యారేజ్‌ పాఠాలు నేర్చుకుంటేనే..వైవాహిక బంధం పదిలం అనే రోజులా?..అని ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే ప్రస్తుతం పెళ్లిళ్లన్నీ మూన్నాళ్లు ముచ్చటగా మారిపోతున్నాయి. మార్నింగ్‌ పెళ్లి.. సాయంత్రం విడాకులు అన్నట్లుగా మారాయి. ఆ విడాకులు మాటకు చెక్‌పెట్టడం కోసమే ఇదంతా. ఎక్కడ ఈ పాఠాలు చెబుతున్నారంటే..

వివాహ సంసిద్ధత పేరుతో ఈ కోర్సుని ప్రారంభించారు. ఇది కేవలం పెళ్లికి సిద్ధమవ్వడం వరకే పరిమితం కాదు ఈ కోర్సు. అవగాహన, నిబద్ధత, వైవాహిక బాధ్యతలు గురించి వివరిస్తారు. ఆరోగ్యకరమైన బంధాన్ని ఏర్పరచుకోవాలి, దాన్ని ఎలా పదిలం చేసుకోవాలో నేర్పిస్తారట. ఈ కోర్సుని గోవాలోని గోవా కాలేజ్‌ ఆఫ్ హోమ​ అనే కళాశాల ప్రారంభించింది. వివాహ సంసిద్ధ అనే 15 రోజుల కోర్సుని అందిస్తున్నట్లు వెల్లడించింది. ఈ కోర్సు వచ్చే నెల డిసెంబర్‌ 2 నుంచి డిసెంబర్‌ 17 వరకు జరుగనుందని ప్రకటించింది. 

విడాకులు తగ్గించడమే ముఖ్యోద్దేశంగా గోవా ప్రభుత్వం ఈ కోర్సుని ప్రారంభించిందట. రాష్ట్రవ్యాప్తంగా విడాకులు తగ్గించి..వివాహానికి ముందే దానిపై అవగాహన కల్పించేలా కౌన్సిలింగ్‌ ప్రవేశపెట్టాలనే ఉద్దేశ్యంతో ఇలా వివాహ సంసిద్ధత అనే పేరుతో పెళ్లి కోర్సుని ప్రారంభించారు. పాపం గోవా సివిల్‌ కోర్టులో 2022-2025 మధ్యలోనే ఏకంగా 3 వేలకు పైగా విడాకుల పిటిషన్లు దాఖలయ్యాయని చెప్పుకొచ్చారు. వీటిలో 2024లోనే ఏకంగా 947 పిటిషన్లు దాఖలయ్యాయట. ఆ నేపథ్యంలోనే తమ కళాశాలలో పెళ్లికి సంబంధించిన కోర్సుని ప్రవేశ పెట్టినట్లు సదరు కళాశాల ప్రిన్సిపాల్‌ మహేష్ పాయ్ అన్నారు. 

దీన్ని నవ్వులాటగా చూడొద్దని కోరారు. పెళ్లికి సిద్ధమవ్వడం అంటే పెళ్లికి రెడీ అవ్వడానికి మించి అని..అందులో ఉండే బరువు బాధ్యతలు,  కష్ట నష్టాలు..ఒకరినొకరు అర్థం చేసుకునే విధం తదితరాలన్నిటిపై అవగాహన అవసరం అని అన్నారు. ఇది ఆరోగ్యకరమైన బంధాలను ఏర్పరచుకునేందుకు, భాగస్వామి మనసెరిగి నడుచుకోవడం ఎలా అనేది నేర్పిస్తుందని చెబుతున్నారు. ఈ కోర్సుకి వివాహానికి రెడీగా ఉన్న యువతీ యువకులు, డిగ్రీ, పీజీ చేసిన విద్యార్థులు అర్హులట.

ఇదీ చదవండి: ఆ సాహస లక్ష్మికి ఆనంద్‌ మహీంద్రా బాసట..!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement