ఆ సాహస లక్ష్మికి ఆనంద్‌ మహీంద్రా బాసట..! | Anand Mahindras Nanhi Kali to support raptadu incident victim laxmi | Sakshi
Sakshi News home page

ఆ సాహస లక్ష్మికి ఆనంద్‌ మహీంద్రా బాసట..!

Nov 6 2026 4:54 PM | Updated on Nov 6 2026 5:04 PM

Anand Mahindras Nanhi Kali to support raptadu incident victim laxmi

అనంతపురం జిల్లా రాప్తాడులో పదో తరగతి అమ్మాయిపై ఎలక్ట్రిక్ రంపంతో జరిగిన దాడి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఒక స్కూలు క్లాస్‌రూమ్‌లో జరిగిన ఈ ఘటనతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. యావత్తు దేశం ఉలిక్కిపడేలా చేసిన ఘటన ఇది. అయితే ఆ వేళ ఉన్మాది గోపిక అనే అమ్మాయిపై రంపంతో దాడిచేస్తుంటే..స్నేహితురాలు లక్ష్మీ ప్రాణాలు పణంగా పెట్టి కాపాడే ప్రయత్నం చేసింది.

ఆ ఆకస్మిక దాడికి ఎవరికి వారు ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేసే తరుణంలో ఆమె చూపిన తెగువ అందరి హృదయాల్ని తాకడమే కాదు..ఆమె స్పందించిన తీరుకి సలాం అని జైజైలు కొట్టారు. అయితే ఈ ఘటనలో ఆమె కూడా తీవ్ర గాయలపాలైంది. ప్రతి ఒక్కరూ ఆమెను సాహసలక్ష్మీ అంటూ వేన్నోళ్లు కొనియాడారు. దీనిపై పారిశ్రామిక దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా స్పందిస్తూ..ఎక్స్‌ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. 

సదరు సాహసలక్ష్మీని రియల్‌ హీరో అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. అంతేగాదు ప్రెండ్‌ కోసం ప్రాణాలు అడ్డుపెట్టి పోరాడిన తీరుకి ఫిదా అవుతూ ఆమె చదువుకు అవసరమయ్యే ఆర్థిక సాయం అందిస్తానని ప్రకటించారు. తన ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ నన్హికలి అండగా ఉంటుందని ప్రకటించారు. ఆమె అసాధారణమైన యువతి అని, ధైర్యం అంటే భయపడకపోవడం కాదు, అవతలి వాళ్లపట్ల చూపే శ్రద్ధ అని అన్నారు. కాగా, ఈ ఘటనకు కారణమైన నిందితుడు హేమంత్‌ని గుర్తించి అరెస్టు చేశారు. అతడు బాధితురాలి మేనమామ అని, గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు సమాచారం. 

 

ఇదీ చదవండి: దిండు ఖరీదే రూ. 40 వేలా..! స్పెషా​ల్టీ ఇదే..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement