టీడీపీ రిగ్గింగ్‌ చేసిన చోట వైఎస్సార్‌సీపీ ఘన విజయం | YSRCP achieves a thumping victory TDP resorted to rigging | Sakshi
Sakshi News home page

టీడీపీ రిగ్గింగ్‌ చేసిన చోట వైఎస్సార్‌సీపీ ఘన విజయం

Nov 3 2026 4:55 PM | Updated on Nov 3 2026 5:39 PM

YSRCP achieves a thumping victory TDP resorted to rigging

అనంతపురం:  స్థానిక ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలుకొని,, పోలింగ్‌ జరిగే వరకూ ఎన్నో అరాచకాలకు పాల్పడింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు కూటమి అభ్యర్థులు గెలిచామని చెప్పుకుంటున్న ప్రతీ చోట అప్రజాస్వామికమే తాండవించింది.

ఇది కేవలం తాము గెలిచామని చెప్పుకోవడానికి తప్పితే, ప్రజ్వాసామ్య బద్ధంగా ఎన్నికలు జరగలేదనేది జగమెరిగిన సత్యం. అయినా వైఎస్సార్‌సీపీ పలు చోట్ల సత్తా చూపెట్టింది. స్వయంగా మంత్రి సత్యకుమార్‌ అనుచరులు రిగ్గింగ్‌ చేసిన అనంతపురం డివిజన్‌-30లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించడమే ఇందుకు నిదర్శనం. 

ఈ డివిజన్‌ 3వ బూత్‌లో కెమెరాల సాక్షిగా గుంప గుత్తగా ఓట్లు వేస్తూ మంత్రి సత్యకుమార్‌ అనుచరులు దొరికిపోయారు. తమకు అవకాశం వచ్చిందే తడువుగా భారీ రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. 

అయితే  ఇక్కడ ప్రజలు అత్యధిక సంఖ్యలో ఓటింగ్‌ హాజరై వైఎస్సార్‌సీపీకి జై కొట్టడంతో ఆ రిగ్గింగ్‌ వేషాలు ఇక్కడ పనిచేయలేదు. తద్వారా వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది.  ఈ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ తరఫున కార్పొరేటర్‌గా అభ్యర్థిగా బరిలోకి దిగిన శివరామిరెడ్డి 60కు పైగా ఓట్ల తేడాతో గెలిచారు. 

ఇదీ చదవండి: కౌంటింగ్‌లో గందరగోళం.. టీడీపీ కుట్రలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement