కౌంటింగ్‌లో గందరగోళం.. టీడీపీ కుట్రలు | ruckus in ap local body elections counting | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌లో గందరగోళం.. టీడీపీ కుట్రలు

Nov 3 2026 4:07 PM | Updated on Nov 3 2026 4:52 PM

ruckus in ap local body elections counting

నంద్యాల జిల్లా: డోన్ మున్సిపల్ ఎన్నికల 7వార్డు కౌంటింగ్‌లో గందరగోళం నెలకొంది. మొదట వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రుక్సాన 4 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రెండు సార్లు రీకౌంటింగ్ పెట్టినా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి 4 ఓట్ల మెజారిటీతో గెలిచారు. డిక్లరేషన్ ఫామ్ ఇవ్వకుండా అధికారులు జాప్యం చేశారు. నోటీస్ బోర్డులో టీడీపీ అభ్యర్థి గెలుపొయిందినట్లు ప్రకటించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మరోవైపు, నంద్యాల జిల్లాలోని బేతెంచర్ల నగర పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌లో టీడీపీ కుట్రలకు పాల్పడింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్దులు గెలిచిన 2, 3, 6, 14,16, 18, 21, 22, 26 వార్డు లకు రీకౌంటింగ్ పెట్టాలని టీడీపీ డిమాండ్ చేసింది. టీడీపీ నాయకులకు తలొగ్గి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, 9 వార్డులలో రికౌంటింగ్‌కు ఆదేశాలు ఇచ్చారు.

అధికారులను ప్రభావితం చేస్తూ.. 
కాగా, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం కౌంటింగ్ కేంద్రంలో టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారు. 41వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అనిల్ విజయం సాధించారన్న అక్కసుతో ఆయన డిక్లరేషన్‌ను చించేశారు టీడీపీ నేతలు. బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయం నుంచి కౌంటింగ్ కేంద్రంలో అధికారులను టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ శ్రీనివాస్ రావు ప్రభావితం చేస్తున‍్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement