సాక్షి,చిత్తూరు: సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో అధికార టీడీపీకి ఎదురుగాలి వీచింది. కుప్పంలోని పలు వార్డులలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. ఈ పరిణామాలను జీర్ణించుకోలేక కూటమి శ్రేణులు దౌర్జన్యాలు, అరాచకాలకు పాల్పడుతున్నాయి.
కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 3, 7, 8 వార్డులలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా మూడవ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి 250 ఓట్ల మెజారిటీతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇంతటి స్పష్టమైన ఆధిక్యం వస్తున్నప్పటికీ, ఓటమి భయంతో టీడీపీ గూండాలు అరాచకానికి తెరలేపారు.
ఏడవ వార్డులోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మనోహర్ ఆధిక్యంలో ఉండటాన్ని ఓర్వలేక టీడీపీ నేతలు కుట్రలు పన్నారు. కౌంటింగ్ కేంద్రంలో ఉన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను టీడీపీ నాయకులు బలవంతంగా బయటకు నెట్టివేసి దౌర్జర్యానికి దిగారు. దీంతో కౌంటింగ్ కేంద్రాల వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఇదీ చదవండి : గుండెలు తీసిన ‘పచ్చ’ బంట్లు!


