ఎమ్మెల్యే బాలకృష్ణతో పీఏ శ్రీనివాసరావు (ఫైల్)
సాక్షి,శ్రీసత్యసాయి : హిందూపురం కౌంటింగ్ కేంద్రంలో బాలకృష్ణ పీఏ హల్‌చల్ చేస్తున్నాడు. కౌంటింగ్ కేంద్రంలో పోలీసులకే పీఏ శ్రీనివాసరావు డైరెక్షన్ ఇస్తున్నాడు. అధికారుల స్థానాలను (ప్లేస్‌లను) ఆయనే డిసైడ్ చేస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవికి పీఏ శ్రీనివాసరావు ప్రధాన అనుచరుడు. అందుకే ఇతనికి ఇస్తున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ కాంట్రాక్ట్ ఇవ్వాలన్నా, ఎవ్వరికి ఏ అనుమతి కావాలన్నా శ్రీనివాసరావు అనుమతి తప్పనిసరి.
పోలీసు వ్యవస్థ మొదలు అన్ని వ్యవస్థలూ ఇతని చెప్పుచేతల్లోనే ఉంటున్నాయంటే అతిశయోక్తి కాదు. కప్పం కట్టే వాడిదే పెత్తనం అన్న చందంగా బ్రిటీష్ తరహా పరిపాలన సాగిస్తున్నాడు. అదే తరహా పద్దతిని మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లోనూ ప్రదర్శిస్తున్నాడు. కౌంటింగ్ కేంద్రంలో ఏ అధికారి ఎక్కడ ఉండాలో దిశానిర్ధేశం చేస్తున్నాడు. పోలీసులను శాసిస్తూ పేట్రేగిపోతున్నాడు.
ఇదీ చదవండి : పక్కా రిగ్గింగ్!


